Advertisementt

ఇంతకీ రానాలో మేటరుందా.. లేదా...?

Sat 09th Sep 2017 01:59 PM
rana daggubati,meda meeda abbayi,satire,matter,allari naresh  ఇంతకీ రానాలో మేటరుందా.. లేదా...?
Satire on Rana in Meda Meeda Abbayi Movie ఇంతకీ రానాలో మేటరుందా.. లేదా...?
Advertisement
Ads by CJ

అల్లరినరేష్‌, రానా దగ్గుబాటి ఇద్దరు మంచి స్నేహితులు. తాజాగా విడుదలైన అల్లరినరేష్‌ 'మేడమీది అబ్బాయి' చిత్రం ట్రైలర్‌లో ఓ డైలాగ్‌ ఉంది. 'మేటర్‌ లేనోడికి మేటర్‌ లేదని చెప్పాలి... గానీ నువ్వు దగ్గుబాటి రానా ని దగ్గరుండి నెట్టకూడదు' అనే డైలాగ్‌. నిజంగా ఈ డైలాగ్ చాలా కాంట్రవర్సీ అవ్వాల్సింది. ఈ డైలాగ్ కి అర్ధం రానాలో మేటర్ లేదు. ఏదో తన తండ్రి, తాత పేర్లు చెప్పుకునే అవకాశాలు పట్టేస్తున్నాడు. వెనుకున్న పేరు, పలుకుబడి తప్ప రానాలో మేటర్ ఏం లేదు అనేది ఈ డైలాగ్‌ లో వున్న విషయం. ఈ డైలాగ్  రానా చెవిన పడటంతో ఓ రోజు అల్లరి నరేష్‌కి ఫోన్‌ చేశాడట. 

'ఏంటి బాబాయ్ నన్ను అంత మాట అనేశావ్.. ఇంతకీ నాలో మేటర్‌ ఉందంటావా? లేదంటావా? బాబాయ్‌' అని అల్లరినరేష్‌ని అడిగాడట. ఈ విషయాన్ని రానా 'నెంబర్‌వన్‌ యారీ' కార్యక్రమానికి హాజరైన అల్లరినరేష్‌ చెప్పాడు. రానాతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, అందుకే సరదాగా ఆ డైలాగ్‌ పెట్టామని అల్లరోడు చెప్పుకొచ్చాడు. ఈ డైలాగ్‌ పాజిటివ్‌ ఫీలింగ్‌నే ఇస్తుందని అల్లరోడు చెప్పుకొచ్చాడు. 

అంటే మేటర్ లేకుండా బాహుబలి అంతటి సినిమాలో విలన్ రోల్ వస్తుందా! రానా లో వున్న మేటర్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాలా! కానీ సరదా కోసమే దీన్ని రివర్స్ లో ప్రయోగించినట్లుగా అల్లరి సమాధానం ఇచ్చాడంట.  తాను కూడా ఈ డైలాగ్‌ని సరదాగానే తీసుకున్నానని రానా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇక ఈ చిత్రంపై అల్లరినరేష్‌కి బోలెడు ఆశలున్నాయి. 

Satire on Rana in Meda Meeda Abbayi Movie:

Controversy Dialogue in Meda Meeda Abbayi Movie on Rana Daggubati 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ