Advertisementt

శోభన్‌బాబు-జయలలిత వ్యవహారం ఇదే..!

Sat 09th Sep 2017 06:39 PM
k rama lakshmi,arudra wife,sobhan babu,jayalalithaa,affair  శోభన్‌బాబు-జయలలిత వ్యవహారం ఇదే..!
Writer K.Rama Lakshmi reveals about Sobhan Babu, Jayalalithaa affair శోభన్‌బాబు-జయలలిత వ్యవహారం ఇదే..!
Advertisement
Ads by CJ

నాటి తెలుగు ప్రజల అందగాడు, సోగ్గాడు శోభన్‌బాబు, నాటి నటి, తర్వాత తమిళనాడు సీఎం అయిన జయలలితలు ఒకరినొకరు ప్రేమించుకున్నారని, కానీ వారు వివాహం చేసుకోకపోవడంతో జయలలిత ఎమ్జీఆర్‌తోనే ఉండిపోయి,చివరకు తమిళనాడు సీఎం అయిందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్‌, రైటర్‌, క్రిటిక్‌, నాటి ఆరుద్ర గారి భార్య రామలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది. 

ఆమె మాట్లాడుతూ, ఓ రోజు శోభన్‌బాబుగారు వారింటికి నన్ను పిలిచారు. తన భార్యను నాకు చూపించాలనేది ఆయన కోరిక కాబోలు. శోభన్‌బాబు గారి భార్య గౌడి గేదెలా ఉంటుంది. అయితే ఆమె మంచి మనిషి. అప్పుడు శోభన్‌బాబుగారు నాకు తన భార్యని పరిచయం చేస్తూ 'నా గురువుగారి కూతురు. ఆయన పెళ్లి చేయలేదు (చేయలేకపోయాడు). దాంతో నేనే పెళ్లి చేసుకున్నాను'.. అని నాతో చెప్పాడు. ఇంత అందగాడివి, ఆమెని ఎలా చేసుకున్నావు అని నేను అడుగుతానని శోభన్‌బాబు భావించారు. నేను అప్పుడు 'దటీజ్‌ ఏ ఫేట్‌'...నాలాంటి గయ్యాళి భార్య ఆరుద్రకు వస్తుందని ఎవరైనా భావించారా? అని అన్నాను. 

అంతేకాదు.. నాడు మా ఆయన ఎవరితోనైనా నా మీద మాట పడనివ్వదు నా భార్య అని చెప్పేవాడు. మాట పడ్డాక తట్టుకోవడం కష్టం కదా...! అందుకుని మాట పడనివ్వకుండా చూసుకుంటే సరిపోతుంది కదా... అనేది నా మనస్తత్వం అని రామలక్ష్మి చెప్పుకొచ్చారు. 'జీవనజ్యోతి' చిత్రానికి 'సిన్ని.. సిన్ని....ఓ సన్నజాజుల సన్ని' పాట రాస్తున్నప్పుడు నేను శోభన్‌బాబుగారి ఇంటికి వెళ్లాను. ఆయన మీరు కథ ఆడవారి మీదే రాస్తారు. టైటిల్‌ అడవారి పేరు మీదే పెడతారు. కనీసం మగటైటిల్‌ అయినా ఇవ్వరేంటి..? అని శోభన్‌బాబు అనేవాడు. శోభన్‌బాబు వెరీ నైస్‌ మ్యాన్‌. జయలలిత వెరీ.. వెరీ.. ఫైన్‌..టాలెంటెడ్‌ గర్ల్‌. 'గోరింటాకు' చిత్రాన్ని జయలలిత ఇంట్లో చిత్రీకరించారు. 

'మీరందరూ ఇక్కడే భోజనం చేయండి' అని శోభన్‌బాబుతో జయలలిత ఆరోజున అంది. 'ఎందుకు ..ఫుల్‌డే షూటింగ్‌ లేదు' అని శోభన్‌బాబుగారు అన్నారు. 'లేదు.. లేదు.. నేను వడ్డిస్తా..' అంది జయలలిత. జయలలిత నిజమైన ప్రేమ కనబరుస్తుంది. జయలలితను శోభన్‌బాబు పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ సాధ్యపడలేదు. ఎందుకంటే ఆయన తన భార్యని మోసం చేయలేకపోయాడు. శోభన్‌బాబు చాలా సిన్సియర్‌. శోభన్‌బాబు కొడుకు కూడా బాగుంటాడు. కానీ ఎందుకో శోభన్‌బాబు ఆయన్ను సినిమాలలోకి రావద్దని చెప్పాడు.. అని రామలక్ష్మి గతానుభవాలను చెప్పుకొచ్చింది. 

Writer K.Rama Lakshmi reveals about Sobhan Babu, Jayalalithaa affair:

Writer, lyricist and Arudra’s wife K Rama Lakshmi revealed startling facts about an affair between Telugu actor Sobhan Babu and former Chief Minister and actress Jayalalithaa.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ