Advertisementt

జమున పాత్రకి ఎవరో తెలుసా మీకు..?

Sun 10th Sep 2017 08:19 PM
savitiri biopic mahanati,shalini pandey,jamuna role,arjun reddy actress  జమున పాత్రకి ఎవరో తెలుసా మీకు..?
Actress Shalini Pandey Jamuna Role in Mahanati Savitiri Biopic జమున పాత్రకి ఎవరో తెలుసా మీకు..?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అశ్వనీదత్‌ అల్లుడు నాగ్‌ అశ్విన్‌ మహానటి సావిత్రి జీవిత చరిత్రను 'మహానటి' అనే పేరుతో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆయన కూతుర్లు ప్రియాంకాదత్‌, స్వప్నాదత్‌లు నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో మహానటి సావిత్రిగా కీర్తిసురేష్‌ నటిస్తుండగా, జెమినీ గణేషన్‌ పాత్రను మలయాళ నటుడు దుల్కర్‌సల్మాన్‌ పోషిస్తున్నాడు. సమంత ఓ కీలకపాత్రను పోషిస్తోంది. ఇక ఈచిత్రంలో పలువురు నటీనటులు నటించనున్నారు. 

మహానటి సావిత్రి జీవితంలో అనుబంధం ఉన్నవారందరూ ఈ మూవీలో కనిపించనున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత చక్రపాణిగా ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఇక సావిత్రి జీవితంలో ముఖ్యమైన పాత్ర అయిన ఎస్వీరంగారావు పాత్రను మోహన్‌బాబు పోషించే అవకాశాలున్నాయి. మరి నాటి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల పాత్రలను ఎవరు పోషిస్తారో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో సావిత్రి జీవిత చరిత్రతో మంచి అనుబంధం ఉన్న మరో గొప్పనటి జమున పాత్రకు 'అర్జున్‌ రెడ్డి' ఫేమ్‌ షాలిని పాండే నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. 

'అర్జున్‌ రెడ్డి' చిత్రంలో షాలిని పాండే నటనకు ముగ్దుడైన దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ఆ పాత్రకు షాలినిని ఎంపిక చేసినట్లుతెలుస్తోంది. ఇక 'అర్జున్‌ రెడ్డి' హీరో విజయ్‌ దేవరకొండ కూడా ఈ 'మహానటి' బయోపిక్‌లో కీలక పాత్రను పోషిస్తున్న సమంతకు జోడీగా మరో ముఖ్యపాత్రని పోషిస్తున్నాడట. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈచిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తుండగా, వచ్చే ఏడాది అంటే 2018లో ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం. 

Actress Shalini Pandey Jamuna Role in Mahanati Savitiri Biopic:

Arjun Reddy actress Shalini Pandey to play actress Jamuna role in Savitiri biopic Mahanati.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ