Advertisementt

ఎన్టీఆర్ ఇద్దరంటూ.. భలే ట్విస్ట్ ఇచ్చాడుగా!

Mon 11th Sep 2017 07:13 PM
jai lava kusa,jr ntr,two friends,suspense,jai lava kusa pre release event  ఎన్టీఆర్ ఇద్దరంటూ.. భలే ట్విస్ట్ ఇచ్చాడుగా!
NTR Maintains Suspense on Two Celebs Who Okayed JLK ఎన్టీఆర్ ఇద్దరంటూ.. భలే ట్విస్ట్ ఇచ్చాడుగా!
Advertisement
Ads by CJ

సినిమా హిట్ అవుతుందా... లేదా అనేది తర్వాతి మాట.... అభిమానులకి నచ్చింది తీశామా... అలాగే అమ్మా నాన్నలకు నచ్చింది చేశామా... అన్నదమ్ములకు నచ్చిందా అనే సినిమా తీస్తే చాలనుకున్నాం... అలాగే 'జనతా గ్యారేజ్' తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలో అర్ధం కాలేదు, అలాంటి టైంలో దర్శకుడు బాబీ దగ్గర కథ వుంది వినకూడదా అని ఒకసారి అన్నయ్య చెప్పాడు... అయ్యో విందాం అన్నయ్య అని చెప్పా.... అంటూ జై లవ కుశ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఉద్వేగ భరిత ప్రసంగంలోని కొన్ని మాటలు. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ ఆదివారం సాయంత్రం అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ 'జై లవ కుశ' థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఈ ఈవెంట్ లో మాట్లాడిన ఎన్టీఆర్, బాబీ 'జై లవ కుశ' కథతో తన దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు వెంటనే లేచి హగ్ ఇవ్వడం కానీ... షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ చెయ్యలేదని.... అసలు ఈ కథను నేను చేయగలనా అని ఆలోచించానని చెప్పాడు. అలాగే జై లవ కుశ కథని చెయ్యాలా వద్ద అని కేవలం ఇద్దరి సన్నిహితులకు మాత్రమే అడిగానని వారు కథ విని ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది చెయ్యి అని ప్రోత్సహించారని చెప్పాడు. అయితే ఈ సందర్భంగా ఆ ఇద్దరి పేర్లు చెప్పనని.... సినిమా సూపర్ హిట్ అయ్యాకే చెబుతానని చెప్పాడు. 

ఇక ఎన్టీఆర్ 'జై లవ కుశ' ట్రైలర్ లో జై పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతమంటూ అప్పుడే సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రశంసల జల్లు మొదలు పెట్టారు. ఎన్టీఆర్ నత్తిగా మాట్లాడే డైలాగ్స్ సినిమాకే హైలెట్ అంటూ వారు ఎన్టీఆర్ ని పొగిడేస్తున్నారు. ఇకపోతే ఈ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్, రాశి ఖన్నా, నివేత థామస్, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

NTR Maintains Suspense on Two Celebs Who Okayed JLK:

Jai Lava Kusa pre release event became a grand success with huge turnout of fans recorded at the venue.