విజయ్ దేవరకొండ హీరోగా వచ్చి ఎటువంటి అంచనాలు లేకుండా విపరీతమైన నెగెటివ్ పబ్లిసిటీతో విడుదలయిన అర్జున్ రెడ్డి చిత్రం విడుదలై దాదాపు 17 రోజులు కావొస్తున్నా ఆ సినిమా ముచ్చట ఇంకా ముగియలేదు. ఇప్పటికి ఆ సినిమా కలెక్షన్స్ గురించి.. అర్జున్ రెడ్డి సినిమాని పొగుడుతున్న సెలెబ్రటీస్ గురించి.... అర్జున్ రెడ్డి ఇతర భాషల రీమేక్ రైట్స్ గురించి ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. చిన్న చిత్రంగా విడుదలై చితక్కొడుతున్న అర్జున్ రెడ్డి చిత్రాన్ని టాప్ సెలబ్రిటీస్ తెగ పొగిడేస్తున్నారు. సినిమా చూడకుండా అందులో వల్గారిటీ ఉందని వీహెచ్, అనసూయ వంటి వాళ్లకు ఆ సినిమాకి నెగెటివ్ పబ్లిసిటీ ఇవ్వడమే కాదు... సినిమాకి మంచి క్రేజ్ తీసుసుకొచ్చారు.
అర్జున్ రెడ్డి సినిమా విడుదల కాగానే నాని వంటి హీరోలు విజయ్ నటనను, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాని ఆకాశానికెత్తేశారు. అలాగే తాజాగా టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు, టాప్ హీరోయిన్ అనుష్క, టాప్ డైరెక్టర్ రాజమౌళి వంటివాళ్ళు సినిమా విడుదలైన కొద్దిరోజుల తర్వాత సినిమా చూసి అర్జున్ రెడ్డి గురించి ట్విట్టర్ లో పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి ఎక్కడలేని క్రేజ్ రావడమే కాదు విడుదలై ఇన్ని రోజులైనా కూడా ఇప్పటికి ఇంకా కలెక్షన్స్ కొల్లగొడుతూనే వుంది.
ఇక ఇప్పుడు తాజాగా మెగా హీరో టాప్ హీరో అయిన రామ్ చరణ్ రంగస్థలం షూటింగ్ లో బిజీగా ఉండి సినిమా చూడడం ఆలస్యమైందని... సినిమా చూసాక అర్జున్ రెడ్డి సినిమా తీసిన సందీప్ వంగాని అభినందించకుండా ఉండలేకపోతున్నానని... అలాగే విజయ్ నటన సూపర్ అంటూనే అర్జున్ రెడ్డి టీమ్ మొత్తాన్ని ప్రశంసల జల్లుతో ముంచెత్తాడు. రా... రియలిస్టిక్ అండ్ బ్లడీ బోల్డ్. హ్యాట్సాఫ్ టూ సందీప్ వంగా, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే, రాహుల్ ఇలా అర్జున్ రెడ్డి టీమ్ మొత్తానికి పేస్ బుక్ ద్వారా అభినందించాడు. మరి అర్జున్ రెడ్డి కి ఇంకా ఇంకా ఇలాంటి ప్రశంసలు వస్తుంటే సినిమాకి ఇంకా బూస్ట్ ఇచ్చినట్టే అంటున్నారు.