నాగార్జున మొదటి భార్య లక్ష్మికి విడాకులిచ్చి రెండో భార్యగా నాటి నటి అమలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరు కలిసి 'శివ, నిర్ణయం, ప్రేమయుద్దం' వంటి చిత్రాలలో నటిస్తున్నప్పుడే ప్రేమించుకున్నారు. దాంతో లక్ష్మి, నాగార్జున నుండి విడిపోయి వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక నాగార్జున-అమలలు మాత్రం ఆతర్వాత ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ, అన్యోన్యంగా ఉంటున్నారు. వారి కుమారుడే అక్కినేని అఖిల్. సినిమా వారంటే ఎన్నో గాసిప్స్, రూమర్లు ప్రచారంలో ఉంటాయి. కానీ వాటిని లక్ష్మి అర్ధం చేసుకోలేకపోయింది. కానీ అమల మాత్రం నాగార్జునను ఎంతగానో అర్ధం చేసుకుంటూ ఆయనకు తగ్గట్లు నడుస్తోంది. ఇటీవలే 'శివ' చిత్రం విడుదలైన 25 ఏళ్లు అయిన సందర్భంగా నాగార్జున-అమల అక్కినేని అభిమానులకు విషెష్ తెలియజేశారు.
మరోపక్క అమల, నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత నటనకు దూరంగా ఉంటూ బ్లూక్రాస్‌లో యాక్టివ్‌గా ఉంటోంది. కేవలం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో చిన్నరోల్ చేసింది. కాగా నేడు అమల పుట్టినరోజు. దీంతో నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'ఐ లవ్ యూ స్వీట్ హార్ట్' అని తన ప్రేమను తెలియబరిచాడు. అమలతో కలిసి ఉన్న రెండు ఫొటోలను ఆయన అభిమానులతో పంచుకున్నాడు. 'హ్యాపీ బర్త్‌డే.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని నాగార్జున ట్వీట్ చేశాడు. మొత్తంగా అమల ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం....!