Advertisementt

పవన్ అక్కడ.. మహేష్, ఎన్టీఆర్ వల్ల కాదు!

Wed 13th Sep 2017 07:10 PM
pawan kalyan,pspk25 film,pspk25 nizam rights,mahesh spyder,jr ntr jai lava kusa  పవన్ అక్కడ.. మహేష్, ఎన్టీఆర్ వల్ల కాదు!
PSPK25 Maintains Huge Margin with Spyder and Jai Lava Kusa Pre Biz పవన్ అక్కడ.. మహేష్, ఎన్టీఆర్ వల్ల కాదు!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న పవన్ 25 వ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్... కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ తో జోడి కడుతున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా 2018 జనవరి 10 న సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 'జల్సా, అత్తారింటికి దారేది' వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మరలా రిపీట్ కావడంతోనే ఈ సినిమాపై ఇన్ని అంచనాలు నెలకొన్నాయి. అసలు మామూలుగానే పవన్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది.

ఇక ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టైటిల్ 'అజ్ఞాతవాసి' అంటూ ప్రచారంలో ఉంది. ఇకపోతే పవన్ 25 వ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతున్నట్లు ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం నైజాంలో రికార్డు స్థాయి బిజినెస్ చేసిందని చెబుతున్నారు. నైజాం హక్కుల్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు 29 కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ రేటు చూస్తుంటే కళ్ళు తిరగడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే బాహుబలి చిత్రం తర్వాత ఆ రేంజ్ లో నైజామ్ లో ఆ ధర పలకడం కేవలం పవన్ చిత్రానికే సాధ్యమైందంటున్నారు. మహేష్ 'స్పైడర్' 22 కోట్లు, ఎన్టీఆర్ 'జై లవ కుశ' 20.50 కోట్లకి నైజాం రైట్స్ అమ్ముడుపోయాయి.  

మరి ఈ లెక్కన పవన్ - త్రివిక్రమ్ చిత్రం 2018 సంవత్సరం మొదట్లోనే రికార్డులు సృష్టించడం ఖాయంలాగే కనబడుతుంది. నైజాం వరకు పవన్ ని మహేష్ కానీ, ఎన్టీఆర్ కానీ మించలేరు అనేది మరొక్కసారి నిరూపితమైంది. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత అందిస్తుండగా.... ఖుష్బూ, ఇంద్రజ, ఆదిపినిశెట్టి వంటి నటులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం మొత్తం తండ్రి కొడుకుల అనుబంధంతో పెనవేసుకుని ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.

PSPK25 Maintains Huge Margin with Spyder and Jai Lava Kusa Pre Biz:

Pawan Kalyan's new film was sold out to Rs.29 crores to Dil Raju for Nizam area.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ