Advertisementt

కుర్చీ తిరిగినందుకే ఇలా ఉంటే..ఇక ట్రైలరొస్తే?

Thu 14th Sep 2017 09:33 PM
pspk25,pawan kalyan,trivikram srinivas,keerthi suresh,pspk25 overseas rights sensation  కుర్చీ తిరిగినందుకే ఇలా ఉంటే..ఇక ట్రైలరొస్తే?
PSPK25 Film Nizam and Overseas Rights Sensation కుర్చీ తిరిగినందుకే ఇలా ఉంటే..ఇక ట్రైలరొస్తే?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వచ్చే ఏడాది మొదట్లో విడుదలవుతుంది కానీ.... ఈ సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో పవన్ రికార్డులు సృష్టిస్తున్నాడు. పవన్ 25 వ చిత్రం కావడం, రెండు సూపర్ హిట్స్ తర్వాత త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడం వలన ఈ సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే లెవల్లో జరుగుతుంది కూడా.

ఇప్పటికే  పవన్ కళ్యాణ్ 25 వ చిత్రం నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు 29 కోట్ల భారీ ధరకు దక్కించుకుని సంచలనమయ్యాడు. అయితే ఇక్కడ నైజాం లోనే పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించాడు అంటే అక్కడ ఓవర్శిస్ లో కూడా పవన్ కళ్యాణ్ చిత్రానికి భారీ రేటు వచ్చినట్టుగా చెబుతున్నారు. అక్కడ పవన్ చిత్ర హక్కులను బ్లూ స్కై సంస్థ రికార్డు స్థాయిలో 21 కోట్లకు దక్కించుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ లెక్కన పవన్ చిత్రం ఏ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయనుందో అంటూ అప్పుడే పవన్ కళ్యాణ్ ఫాన్స్ బెట్టింగ్స్ స్టార్ట్ చేశారు.

మరి పవన్ కళ్యాణ్ పవర్ అంటే ఏంటనుకుంటున్నారు అంటూ పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఒక్క కాన్సెప్ట్ పోస్టర్ కి, ఒక్క సాంగ్ ప్రోమోకే ఇలాంటి అంచనాలు ఉంటె..... సినిమా టైటిల్ గాని ఫస్ట్ టీజర్ గాని విడుదల చేస్తే గనక పవన్ సినిమాపై ఉన్న అంచనాలు అందుకోవడం ఎవ్వరికి సాధ్యం కావేమో అంటున్నారు. మరి ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్... కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ తో రొమాన్స్ చేస్తున్నాడు.

PSPK25 Film Nizam and Overseas Rights Sensation:

Pawan Kalyan and Trivikram Combo Film Business Sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ