తెలుగు, తమిళ. కన్నడతో పాటు కొన్ని మలయాళీ చిత్రాలు కూడా చేసిన హీరోయిన్ లక్ష్మీరాయ్. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం అయింది. ఈ దశాబ్ద కాలంలో ఆమె 50కి పైగా చిత్రాలలో నటించింది. ఇక తనకు పేరు కలిసి రావడం లేదంటూ కొన్నిసార్లు లక్ష్మీరాయ్ అని మరికొంతకాలం రాయ్‌లక్ష్మీగా ప్రేక్షకులను పలకరిస్తున్న ఈ కన్నడ సుందరి శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'కాంచనమాల కేబుల్‌టీవీ'తో పాటు బాలకృష్ణ 'అధినాయకుడు', రవితేజ 'బలుపు', పవన్‌కళ్యాణ్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్', చిరంజీవి 'ఖైదీనెంబర్150' చిత్రాలలో నటించింది. అయితే ఆమెకు కేవలం ఏదో ఐటం గర్ల్‌గా, అటు వచ్చి ఇటు పోయే పాత్రలు, ప్రత్యేక గీతాలలో నటించడం తప్ప పెద్దగా అవకాశాలేలేవు.
ఇక ఆమె కొన్నేళ్లకిందట భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎమ్మెస్‌ధోనితో కూడా ఎఫైర్ నడిపి వార్తల్లో నిల్చుంది. ఇక ఆమె తన అందాల ఆరబోత విషయంలోఎప్పుడు, ఎవ్వరికీ అడ్డుచెప్పలేదు. అడిగినంతా చూపించడమే కాదు.. అడగని వాటిని కూడా చూపించడం ఈ భామ సెష్పాలిటీ. కాగా ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో 'జూలీ2' చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రం ఒక్క బాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కరెక్ట్‌గా సూటయ్యే 'బోల్డ్ అండ్ బ్యూటిఫుల్' అనే క్యాప్షన్‌ని పెట్టారు. దానికి తగ్గట్లే ఇందులో ఆమె బోల్డ్ సన్నివేశాలలో నటించి, యువతకు మత్తెక్కించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ల్‌లోనే ఈ అమ్మడి సిద్దాంతం, ఆమె అభిమతం స్పష్టంగా కనిపిస్తోంది. సెన్సార్‌బోర్డ్ కూడా ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా 'ఎ' సర్టిఫికేట్ రావడంతో ఆమె అందాలను చూడాలని భావించే శృంగార ప్రియులకు ఆమె తన హద్దుదాటిన అందాల ప్రదర్శనతో కను విందు చేయడం ఖాయమని చెప్పవచ్చు.
తాజాగా ఈ అమ్మడు ఈ చిత్రంలో ఎలా నటించిందో సోషల్‌మీడియాలో పోస్ట్ అయిన ఓ పిక్ ఉదాహరణగా నిలుస్తుంది. 'గజిని' మాదిరిగా ఒంటిపై 'జూలీ... సింగిల్' అని రాసుకుని తన భారీ సౌందర్యాలను ప్రదర్శిస్తూ వీక్షకులకు కనువిందు చేస్తోంది. కనిపించాల్సిన అందాలన్నింటిని చూపిస్తూనే చేతులతో, శిరోజాలతో అడ్డం పెట్టుకుని తన అందాలను ఆరబోయడం చూస్తుంటే ఈ 'జూలీ2' చిత్రంతో బాలీవుడ్‌లోని హాట్ హాట్ గా అందాలు ప్రదర్శించే సెక్సీ బాంబులు కూడా లక్ష్మిరాయ్ అలియాస్ రాయ్ లక్ష్మి గట్టి పోటీ ఇచ్చి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంఖాయంగా కనిపిస్తోంది.