ఎప్పుడో బాలీవుడ్ లో ఫెమస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు కొత్తగా తెలుగు, తమిళ భాషల్లో కూడా మొదలైంది. ఇక ఈ షోలో కొంత ఫెమ్ ఉన్న వాళ్లు, మామూలు వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ గా దిగారు. ఇక ఈ షో బిగ్ బాస్ షోతో హౌస్ లో పార్టిసిపేట్స్ అంతా అక్కడ ఎన్ని రోజులున్నప్పటికీ బయటికి వచ్చాక మాత్రం బిగ్ సీలెబ్రిటీస్ గా మారిపోతున్నారు. బిగ్ బాస్ హౌస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్న కంటెస్టెంట్స్ వారు షోలో అడుగుపెట్టిన్నప్పుడు సాధారణంగా ఉన్నప్పటికీ షో నుండి ఎలిమినేట్ అయిన వెంటనే వారు బయటికి వచ్చి ఫుల్ ఫెమస్ అవుతున్నారు.
అయితే ఇప్పుడు తెలుగులో ఎలాగున్నా తమిళంలో కమల్ హోస్ట్ గా వస్తున్న తమిళ బిగ్ బాస్ లో ఒక చిన్న హీరోయిన్‌కు మాత్రం లక్, పిచ్చ పాపులారిటీ తెచ్చేసింది. అసలు హీరోయిన్ గా అంతగా ఏ మాత్రం పాపులర్ కాని ఒవియా తమిళ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటినుండి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. తమిళ బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేసింది. ఆమె హౌస్ లో ప్రేమ పెళ్లి వ్యవహారాలతో పాటు... ఆత్మహత్య కు కూడా పాల్పడడం వంటి అంశాలతో ఒవియా ఒక్కసారిగా ఫెమస్ అవడమే కాదు బిగ్ సెలెబ్రెటీగా తమిళ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చింది.
ఇక బయటికి వచ్చాక ఒవియా ఇప్పుడు తమిళంలో చక్రం తిప్పుతున్న కొంతమంది హీరోయిన్స్ కి ఝలక్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్స్‌కు చెక్ చెప్పి.... కొన్ని కమర్షియల్ యాడ్స్ కి బ్రాండ్ అంబాసడర్‌గా అవతారమెత్తింది ఈ అమ్మడు. ఇప్పటివరకు తమిళనాడు చెన్నై లో ఫేమస్ అయిన శరవణ స్టోర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న హీరోయిన్స్ ప్లేస్‌లో ఒవియాకు ఛాన్స్ దక్కించుకున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తుంది. అంతేకాకుండా మరికొన్ని కంపెనీల బ్రాండ్స్‌కు సైన్ చేస్తోందని చెన్నై నుండి సమాచారం అందుతుంది. ఇక ఇలా ఒకపక్క బ్రాండ్స్ కి అంబాసిడర్స్ గా చెయ్యడమే కాదు కోలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో వరుస అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా టాక్.