మారుతీ -శర్వానంద్ కలయికలో సైలెంట్ గా బాక్సాఫీసు యుద్దానికి బయలుదేరిన 'మహానుభావుడు' చిత్రం ఈ నెల 29 నే బాక్సాఫీసు బరిలోకి దిగబోతుంది. ఇప్పటివరకు దసరా బరిలో దిగుతున్న ఎన్టీఆర్ 'జై లవ కుశ', మహేష్ 'స్పైడర్' చిత్రాలు రెండూ పబ్లిసిటీ పరంగా దూసుకుపోతుంటే 'మహానుభావుడు' మాత్రం ఇంకా సైలెంట్ గానే వుంది. అయితే ఇప్పటివరకు 'మహానుభావుడు' టీజర్, కొన్ని పాటలను వదిలిన చిత్ర బృందం ఇప్పుడు 'మహానుభావుడు' థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ ఏడాది 'శతమానంభవతి' హిట్ తో 'రాధా' ప్లాప్ తో దూసుకుపోతున్న శర్వా, మారుతీ దర్శకత్వంలో కొత్తగా ట్రై చేస్తున్న 'మహానుభావుడు' చిత్ర ట్రైలర్ అందరిని ఆకట్టుకునేలానే కనబడుతుంది.
మరి 'మహానుభావుడు' చిత్రంలో శర్వానంద్ అతి శుభ్రం వున్న వ్యక్తిగా చించి ఆరేశాడనే చెప్పాలి. ఎవరు తుమ్మినా... ఎవరు దగ్గినా కూడా తాను శుభ్రం పాటించడమే కాదు.... పక్కన వాళ్ళ బైక్ నీట్ గా లేకపోయినా దాన్ని కడిగేసేంత అతి శుభ్రమన్నమాట. శర్వానంద్ శుబ్రానికి పిల్లనిచ్చే మామగారు నాజర్ కూడా చిరాకు పడేంత అతి శుభ్రంతో శర్వానంద్ ఈ సినిమా ట్రైలర్ లో అదరగొట్టేశాడు. ఇక హీరోయిన్ మెహ్రీన్ తో శర్వానంద్ రొమాన్స్ కూడా అదిరింది. మెహ్రీన్ తన తండ్రి నాజర్ తో శర్వాని చూపిస్తూ నాన్నా నాకు నచ్చాడని చెబుతున్నాగా అంటూ ముద్దుగా మాట్లాడుతుంటే దానికి శర్వా కూడా ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్ అంటూ సపోర్ట్ చెయ్యడం... అంతేకాకుండా పెళ్లి చేసుకునే అమ్మాయి కోసం ఊరు వెళ్లిన శర్వాకి అక్కడ అసలు శుభ్రం అంటే ఏమిటో మర్చిపోయేలా చెయ్యడం.. అక్కడ మనం దేన్నైతే అస్యహించుకుంటామో.. దేవుడు అందులోంచి ముంచి లేపుతాడని వెన్నల కిషోర్ చెప్పే డైలాగ్స్, అందులోనే చిన్న యాక్షన్ అంటే మల్ల యుద్ధం సీనుతో పాటే... మళ్లీ ఒక కొత్త కాన్సెప్టా.. ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఇవ్వడం లేదంటూ శర్వానంద్ చెప్పే కామెడీ డైలాగు అబ్బో... అన్ని సూపర్ గా వున్నాయి.
మరి మారుతీ 'భలే భలే మగాడివోయ్' లాంటి కామెడీ హిట్ ఈ 'మహానుభావుడు'తో కొట్టబోతున్నాడనే విషయం అర్ధమవుతుంది. అలాగే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన నిజార్ షెఫీ అన్ని సీన్స్ ని అందంగా తెరకెక్కించాడు. అలాగే థమన్ కూడా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు.మరి ఒక మాస్ 'జై లవ కుశ' అలాగే ఒక క్లాస్ 'స్పైడర్' తో పోటీ పడి కుటుంబ కథా చిత్రంగా ఈ 'మహానుభావుడు'తో శర్వానంద్ మరోమారు పండగ సీజన్ లో విజయాన్ని అందుకుంటాడని అనిపిస్తోంది.