Advertisementt

'సై... రా'లో అలా జరిగిందా అయ్యో.. పాపం..!

Thu 21st Sep 2017 12:40 PM
chiranjeevi,chiranjeevi 151,sye raa narasimha reddy,ar rahman,ravi varman,ram charan,surender reddy  'సై... రా'లో అలా జరిగిందా అయ్యో.. పాపం..!
Sye Raa Narasimha Reddy Movie Update! 'సై... రా'లో అలా జరిగిందా అయ్యో.. పాపం..!
Advertisement
Ads by CJ

చిరంజీవి 151వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి' ఆఫీషియల్ గా మొదలైపోయింది. ఈ చిత్రం ఆఫీషియల్ గా మొదలయినప్పటికి ఇంకా షూటింగ్ మాత్రం స్టార్ట్ చేసుకోలేదు. అయితే పక్కా స్క్రిప్ట్ రెడీగా ఉన్నప్పటికీ కొన్ని పనుల వల్ల ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల, టెక్నీషియన్స్  వివరాలు సినిమా మోషన్ పోస్టర్ లోనే రివీల్ చేశారు. ఈ చిత్రంలో నయనతార, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి హేమాహేమీలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే చిత్ర బృందం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ పేరు కూడా మోషన్ పోస్టర్ లో వేసింది. ఇక ఆఫీషియల్ గా ఏ ఆర్ రహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. కాకపోతే ఈ మధ్యన మాత్రం ఏ ఆర్ రహమాన్ కున్న పాత కమిట్మెంట్స్ వల్ల సై రా చిత్రానికి మ్యూజిక్ అందించలేనని.. అందుకే ఈ సినిమా నుండి బయటికి వచ్చేసినట్టుగా ప్రచారం జోరుగా జరిగింది. కానీ సాయ్ రా యూనిట్ నుండి అధికారిక సమాచారం అంటూ ఏమిలేదు. మరి సై రా లో ఏ ఆర్ రహమాన్ ఉన్నాడా? లేడా అనేది కన్ఫర్మ్ కావాల్సి ఉంది.

ఇటువంటి తరుణంలోనే ఇప్పుడు ఈ సై రా నుండి మరో టాప్ టెక్నీషియన్ తప్పుకున్నట్టుగా వార్తలొస్తున్నాయి. సై రా ఆఫీషియల్ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ కూడా ఈ సినిమా నుంచి బయటకి వెళ్ళిపోయారు అని టాక్ వినబడుతుంది. అయితే రవి వర్మన్ సై రా యూనిట్ తో ఉన్న పర్సనల్ ఇష్యూస్ వల్లే ఈ సినిమా నుంచి వెళ్ళిపోయారు అంటున్నారు. మరి సినిమా మొదలవ్వకముందే ఇలా ఎవరికీ వారే ఈ సినిమా నుండి బయటికి వచ్చేస్తున్నారు అంటూ కథనాలు రావడంతో సినిమాపై నెగెటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందని.. అందుకే ఈ విషయమై రామ్ చరణ్ క్లారిటీ ఇస్తే బావుంటుందని మెగా ఫాన్స్ కోరుతున్నారు.

Sye Raa Narasimha Reddy Movie Update!:

Cinematographer Ravi Varman also Dropped in Chiranjeevi 151 Movie Sye Raa Narasimha Reddy.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ