Advertisementt

నాగబాబు కూతురు 'హ్యాపీ వెడ్డింగ్' ఈ హీరో తోనే!

Sat 23rd Sep 2017 10:52 AM
konidela niharika,sumanth ashwin,happy wedding,naharika second movie,music director devi sri prasad  నాగబాబు కూతురు 'హ్యాపీ వెడ్డింగ్' ఈ హీరో తోనే!
Konidela Niharika With Sumanth Ashwin! నాగబాబు కూతురు 'హ్యాపీ వెడ్డింగ్' ఈ హీరో తోనే!
Advertisement
Ads by CJ

మెగా హీరోలు మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్న టైం లో నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తా అంటూ మెగా బ్రదర్ నాగ బాబు డాటర్ నిహారిక కూడా బయలుదేరింది. ఒక మనసు సినిమాతో నాగ సౌర్యతో మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించి బాగానే మెప్పించింది. మరి కేవలం ట్రెడిషనల్ గా కనబడితే హీరోయిన్ గా ఎంతో కాలం చెల్లుబాటు కాలేమన్నట్లుగానే.... నిహారిక ఒక మనసు విడుదలైన చాలా టైం తీసుకుని తమిళంలో ఒక సినిమాలో నటిస్తుంది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాక నిహారిక తమిళంలోకి చెక్కేసింది అన్నారు. అంతేకాకుండా నిహారిక, నాగ సౌర్యాని పెళ్లిచేసుకోబోతుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ ఆవార్తలను నాగ బాబు ఖండించాడు అది వేరే విషయం.

ఇక ఇప్పుడు నిహారిక తెలుగులో తన రెండో సినిమా చేయబోతుంది.  తాజాగా సుమంత్ అశ్విన్ హీరోగా.. రూపొందనున్న హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో నీహారిక హీరోయిన్ గా నటించబోతోందని అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ సమర్పణలో.. పాకెట్ సినిమా నిర్మాణంలో హ్యాపీ వెడ్డింగ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో నిహారిక, సుమంత్ అశ్విన్ తో జోడి కట్టబోతుంది. అలాగే లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్క నున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్రం రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది.

Konidela Niharika With Sumanth Ashwin!:

Niharika Konidela second movie is going to pair up with young and handsome Sumanth Ashwin in next titled Happy Wedding.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ