పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమా తన తనయుడు ఆకాశ్ తో ఉంటుందని చెప్పారు. ప్రేమ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతుందని అన్నారు. ఈ సినిమాలో ఆకాశ్ జోడీగా కొత్త హీరోయిన్ ను పరిచయం చేయనున్నట్టు చెప్పారు. ఆ పని పూర్తయిందనేది తాజా సమాచారం. ఎప్పుడు సినిమా తీసినా కొత్త కొత్త భామలను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసే పూరీ ఈ సారి తన కుమారుడితో తెరకెక్కించునున్న మూవీలోనూ ముంగారు మేల్-2తో సూపర్ హిట్ అందుకున్న నేహా శెట్టిని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నాడని తెలుస్తోంది.
ఆకాష్ పూరీ సరసన నటించేందుకు ఎవరైతే సూటవుతారని అందాల భామలో వేటలో పడ్డ పూరీ జగన్నాథ్ సుమారు 200 మంది హీరోయిన్లను ఆడిషన్ చేసి.. చివరగా కేరళ ముద్దుగుమ్మ నేహా శెట్టికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఆడిషన్ అనంతరం నేహా శెట్టి తెలుగు పదాలు తిన్నగా నేర్చుకోవడం మొదలుపెట్టిందట. అంతేకాదు శరీరాకృతిని మార్చుకునేందుకు జిమ్‌కు వెళుతోందని తెలుస్తోంది.