ఇప్పుడు ప్రపంచం మొత్తం సెల్ఫీ ట్రెండ్ నడుస్తుంది. ఏదన్న కాస్త వెరైటీగా కనబడిందా వెంటనే దానితో సెల్ఫీ తీసుకోవడం సోషల్ మీడియాలో అప్లోడ్ చెయ్యడం. ఈ సెల్ఫీ హడావిడి కేవలం ఒక్క యువత మాత్రమే చేయడంలేదు. పిల్లలు దగ్గర నుండి పెద్దల వరకు ఈ సెల్ఫీ మేనియా పిచ్చిలో పడిపోతున్నారు. ఇక ఆ సెల్ఫీ ల వల్ల కొన్నిసార్లు ప్రాణాలు మీదకు కూడా తెచ్చుకుంటున్నారు యువత. ఎంతగా సెల్ఫీ డెత్ లు భయపెట్టినా కూడా ఎవ్వరు ఈ సెల్ఫీ పిచ్చ నుండి బయటపడలేకపోతున్నారు. మాములుగా నచ్చిన వస్తువుతో సెల్ఫీ తీసుకుని పండగ చేసుకునే జనాలకు ఏకంగా బాహుబలి ప్రభాస్ పక్కన సెల్ఫీ అంటే రెచ్చిపోరు.
అదే జరిగింది మహానుభావుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. శర్వానంద్ - మారుతీ కలయికలో తెరకెక్కిన మహానుభావుడు సినిమా విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది చిత్ర బృందం. అయితే ఆ ఈవెంట్ కి గెస్ట్ గా బాహుబలి ప్రభాస్ హాజరయ్యాడు. మరి ప్రభాస్ హోమ్ బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ వారు మహానుభావుడు చిత్రానికి నిర్మాతలు కావడం... హీరో శర్వానంద్ తో ప్రభాస్ కి ఉన్న స్నేహం కారణంగా ప్రభాస్ ఈ ఈవెంట్ కి హాజరయయ్యాడు. ఇక ఆ ఈవెంట్ లో ప్రభాస్ లుక్ అదుర్స్ అనిపించేలా సూపర్ గా కనబడ్డాడు.
ఇకపోతే ప్రభాస్ ఈవెంట్ లో భాగంగా స్టేజ్ మీదకి ఎక్కగానే అక్కడ మహానుభావుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వ్యాఖ్యాతగా చేసిన యాంకర్ శ్రీముఖి దగ్గర నుండి స్టేజ్ మీదున్న మహానుభావుడు చిత్ర బృందంలోని అందరూ ప్రభాస్ తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. దర్శకుడు మారుతీ తో సహా ప్రభాస్ తో సెల్ఫీ కోసం పోటీ పడడం చూస్తుంటే ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందొ కదా అనిపిస్తుంది. మరి బాహుబలి కీర్తి ప్రతిష్టలంటే మాటలు కాదు కదా... ఇక తాజాగా సాహోతో మరోసారి జాతీయ స్థాయిలో పేరు కొట్టేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడాయే.