Advertisementt

బాక్సింగ్ బ్యూటీతో కుస్తీ వీరుడు!

Mon 25th Sep 2017 10:23 PM
venkatesh,ritika singh,sultan remake,salman khan movie,venkatesh and ritika singh,guru  బాక్సింగ్ బ్యూటీతో కుస్తీ వీరుడు!
Victory Venkatesh in Salman Sultan Remake బాక్సింగ్ బ్యూటీతో కుస్తీ వీరుడు!
Advertisement
Ads by CJ

'గురు' సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ ఇప్పటివరకు మరే చిత్రానికి కమిట్ అవ్వలేదు. తనకి సూటయ్యే పాత్రలో ఈ జనరేషన్ కి దగ్గరగా వుండే కథ కోసం ఎదురుచూస్తున్నాడు వెంకటేష్. ఇంతకుముందు తమిళ రీమేక్ లో వెంకటేష్ తన అన్న కొడుకు రానాతో కలిసి నటిస్తున్నాడని.... బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఇక తాజాగా 'నేనే రాజు నేనే మంత్రి' దర్శకుడు తేజ తో వెంకటేష్ కొత్త సినిమా కథ చర్చలు కూడా జరిగినట్లుగా వార్తలొచ్చాయి. అసలు తేజ - వెంకటేష్ ల కలయికలో ఒక సినిమా దాదాపు ఖరారైనట్లుగా చెప్పారు.

అయితే ఇప్పుడు వెంకటేష్ మీద మరొక న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే వెంకటేష్ 'గురు' తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సురేష్ ప్రొడక్షన్స్‌లో చేయబోతున్నాడనే విషయం తెలిసిందే. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ ‘సుల్తాన్’ని తెలుగులో వెంకటేష్ తో వెంకీ అన్న సురేష్ దగ్గుబాటి  రీమేక్ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి బాలీవుడ్ లో రెజ్లింగ్ వీరుడి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ ‘సుల్తాన్’ సినిమాని ఇక్కడ తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వినికిడి.

ఇప్పటికే 'సుల్తాన్' సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేసే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా స్టార్ట్ అయిందట. ఇక ఈ సినిమాలో ఇంతకుముందు వెంకీతో కలిసి 'గురు'లో నటించిన బాక్సింగ్ బ్యూటీ రితికా సింగ్ నే మరోమారు హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ‘గురు’ సినిమాకి హీరోయిన్ రితికా ఎంత ప్లస్ అయిందనే విషయం తెలిసిందే. అందుకే మరోమారు వెంకీ... రితికాతోనే కుస్తీ పట్టాలని ఫిక్స్ అయిపోయాడట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Victory Venkatesh in Salman Sultan Remake:

Venkatesh and Ritika Singh Pair up Again

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ