Advertisementt

బాలయ్య ఎవరినైనా నమ్మితే అంతే!

Thu 28th Sep 2017 12:09 AM
mokshagna,puri jagannadh,balakrishna,mokshagna cine entry,puri directs mokshagna  బాలయ్య ఎవరినైనా నమ్మితే అంతే!
Puri Jagannadh will Introduce Balakrishna Son Mokshagna బాలయ్య ఎవరినైనా నమ్మితే అంతే!
Advertisement
Ads by CJ

పూరీ జగన్నాథ్‌లో మంచి దర్శకుడు, కథకుడు, డైలాగ్స్‌ రైటర్‌ ఉన్నారు. కానీ ఆయన ఎక్కువగా తన సినిమా కథలు, డైలాగ్స్‌ విషయంలో యువతరానికి చెందిన వారిని గ్రూప్‌గా చేసి, వారి చేత రాయించి ఘోస్ట్‌లుగా వారిచేత అవుట్‌పుట్‌ తెప్పించుకుంటాడనే విమర్శ ఉంది. మరోవైపు ఆయన ఈమధ్య కాలంలో ఎంత తొందరగా సినిమా కథను తయారు చేశాం.. ఎంత తొందరగా సినిమా షూటింగ్‌ పూర్తి చేశాం.. అనే విషయాలలోపడి అసలు కథ మీద కంటెంట్‌ మీద దృష్టి పెట్టడం లేదని, ఇక సినిమాను స్పీడ్‌గా చుట్టేద్దామని భావిస్తున్నాడే గానీ క్వాలిటీ సంగతి విస్మరిస్తున్నాడనే అపవాదు కూడా ఉంది. ఎంత తొందరగా తీసినా, చివరకు సెప్టెంబర్‌ 29న రిలీజ్‌ చేస్తామని ఓపెనింగ్‌రోజు చెప్పి ప్రకటించిన దాని కంటే దాదాపు నెల ముందే సెప్టెంబర్‌ 1నే బాలయ్య వంటి స్టార్‌ చిత్రం 'పైసా వసూల్‌'ని విడుదల చేశాడు. ఈ చిత్రం అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయింది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రాబట్టలేకపోయింది. అయినా బాలయ్య ఒక్కసారి మాట ఇస్తే, ఒక్కసారి ఆయనకు నచ్చితే వారు ఎన్ని ఫ్లాప్‌లిచ్చినా వారికే పిలిచి అవకాశం ఇస్తాడు. 

తాజాగా బాలకృష్ణ వచ్చే ఏడాది ఆగష్టులో తన కుమారుడు నందమూరి మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా తన కుమారుడి తెరంగేట్రం చిత్రానికి బోయపాటి, క్రిష్‌ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం నందమూరి మోక్షజ్ఞ నటించే చిత్రానికి పూరీకి దర్శకత్వబాధ్యతలను బాలయ్యఅప్పగించాడనే వార్తలు వినిపిస్తుండటంతో బాలయ్య అభిమానులు కంగారు పడుతున్నారు. 'పైసా వసూల్‌' చిత్రం ఆడకపోయినా ఇందులో పూరీ టేకింగ్‌, ఆయన తనను కొత్తగా చూపించిన విధానం బాలయ్యని బాగా ఆకట్టుకున్నాయట. 

ఇక ఇంతకు ముందే బాలయ్య చేయబోయే 103వ చిత్రం కూడా పూరీకే చేస్తానని బాలయ్య చెప్పడం, బాలయ్య 103వ చిత్రానికి తానే దర్శకుడిని అని పూరీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పూరీ తన కుమారుడు ఆకాష్‌ పూరీని పూర్తి స్థాయి హీరోగా నిలబెట్టందుకు ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాడు. 'ఆంధ్రాపోరి'తో ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయిన ఆకాష్‌పూరీని ఈ చిత్రం ద్వారా హీరోగా మెప్పించేందుకు పూరీ కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా బెంగుళూరు భామ నేహశెట్టిని పరిచయం చేయనున్నాడు. 

Puri Jagannadh will Introduce Balakrishna Son Mokshagna:

News on Mokshagna cine entry 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ