Advertisementt

కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగిన హీరోయిన్!

Sun 01st Oct 2017 06:35 PM
tamil actress dhansika,t rajendar,kabali movie heroine,vizhithiru movie  కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగిన హీరోయిన్!
T Rajendar Fire on Tamil Actress Dhansika కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగిన హీరోయిన్!
Advertisement
Ads by CJ

నటుడు, నిర్మాత, దర్శకుడు, ఒక హీరోకి తండ్రి అయిన టి రాజేందర్ తమిళనాట ఒక నటిని ఘోరంగా అవమానించాడు. టి రాజేందర్ అవమానించిన నటి ఎవరో కాదు కబాలి ఫేం... హీరోయిన్ ధన్సిక. ధన్సిక విళిథిరు అనే తమిళ సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర బృందం శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ధన్సిక సినిమాలో నటించిన, చిత్రానికి పని చేసిన సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ... పేరు పేరునా అందరికి  కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఆ చిత్రంలో ఒక పాట పాడిన నటుడు రాజేందర్ పేరు ప్రస్తావించడం ధన్సిక  మర్చిపోయింది. అలాంటివి ప్రెస్ మీట్స్ లో, ఇంటర్వూస్ లో సహజంగా జరుగుతూనే ఉంటాయి. 

కానీ అక్కడే ఉన్న రాజేందర్ మైక్ పట్టుకుని ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతు.... ధన్సిక తన పేరు ప్రస్తావించకుండా అందరి పేర్లను ప్రస్తావించిందని.. తీవ్ర అసహనానికి గురవడమేకాదు..... ధన్సిక తీరుపై మండిపడ్డాడు. రజినీతో కలిసి నటించగానే.. స్థాయి పెరిగిపోయిందనుకుంటున్నావా..... కబాలీలో నటించినంత మాత్రాన.. తదుపరి చేసిన సినిమాల గురించి మర్చిపోవాల్సిన అవసరం లేదు అంటూ ఇష్టం వచ్చినట్లు ధన్సిక గురించి మాట్లాడుతుండగా... వెంటనే ధన్సిక లేచి సారీ.. హడావిడిలో మీ పేరు చెప్పడం మరిచిపోయాను క్షమించమని అడగా... దానికి రాజేందర్ ఇంకా రెచ్చి పోయి నువ్వు శారీ కట్టుకోలేదు. కాబట్టి నీ సారీ నాకు అక్కర్లేదు. అయినా నువ్వు హన్సిక అయితే నాకేంటి.... ధన్సిక అయితే నాకేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చెయ్యగా.. దానికి ధన్సిక కన్నీళ్ల పర్యంతమయింది. 

కేవలం ఆమె సారీ చెప్పడమే కాదు రాజేందర్ కాళ్ళు పట్టుకుని మరి క్షమాపణ అడిగినా రాజేందర్ మాత్రం కనికరించకుండా చాలా ఓవర్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ వీడియో, ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయిన టి రాజేందర్ తీరుని చాలామంది నెటిజెన్లు తప్పు పడుతున్నారు. క్షమించమని వేడుకున్నా అంత టెక్కు రాజేందర్ కి పనికిరాదని దుమ్మెత్తి పోస్తున్నారు. 

T Rajendar Fire on Tamil Actress Dhansika:

Dhansika thanked a few people who worked on the film ‘Vizhithiru’, but left out T Rajendar, who decided to launch an attack on her.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ