స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ వన్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. అందులోను ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా రావడం, ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా ఎంతో చక్కగా బిగ్ బాస్ నడవడంతో ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ మీద కొత్త కంటెస్టెండ్ అంటే సెలబ్రిటీస్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా మంచి ఉత్సుకతే చూపిస్తున్నారు. గత వారంతో సీజన్ వన్ ముగియగా.. సీజన్ 1 బిగ్ బాస్ టైటిల్ ని నటుడు శివ బాలాజీ కైవసం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ వన్ సక్సెస్ ఫుల్ గా ముగియడంతో సీజన్ 2 మీద ఫోకస్ పెట్టారు.
ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జరిగినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక సీజన్ 2 లో ఖచ్చితంగా పేరున్న సెలెబ్రిటీస్ పాల్గొనే అవకాశం ఉందని... సీజ్ వన్ లో సాఫ్ట్ గా సాగిన ఈ షో ఇకముందు కూడా ఇలానే కొనసాగుతుందని... భావించే ఇండస్ట్రీలోని పేరున్న సెలెబ్రిటీస్ ఆ షో పట్ల ఆసక్తిని చూపిస్తున్నారట. మాములుగా బాలీవుడ్ బిగ్ బాస్ చూసిన వారు తెలుగు బిగ్ బాస్ లో పాల్గొనడానికి అస్సలు ఆసక్తిని చూపలేదు. బాలీవుడ్ బిగ్ బాస్ వివాదాల పుట్ట. అందుకే తెలుగులో కూడా అలాంటిదేమన్న ఉంటుందేమో అని భయపడ్డారు గాని సీజన్ వన్ సక్సెస్ ఫుల్ గా పూర్తవడంతో ఇప్పుడందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
అలాగే సీజన్ వన్ లో పాల్గొన్న అందరికి బయట మంచి క్రేజ్ వచ్చేసింది. వారెక్కడికి వెళ్లినా అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ గుర్తిపట్టడమే కాదు వారిని గుమిగూడి ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. మరో పక్క బిగ్ బాస్ వలన వారి కెరీర్ లు కూడా చక్కబడుతున్నాయి. ఆ దెబ్బకి బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనేవారి సంఖ్య పెరిగిపోయింది. అలాగే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం తరుణ్, ఛార్మీ లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక సీజన్ 2 లో పాల్గొనే సెలబ్రెటీలు ధన్యా బాలకృష్ణన్, ఆర్యన్ రాజేష్, గజాల, సింగర్ గీతా మాధురి, యాంకర్ లాస్య, చాందనీ చౌదరి, హర్ష, తనీష్, కమెడియన్ వేణు, హీరో వరుణ్ సందేష్‌ను ఎంపిక చేస్తారనే టాక్ వినబడుతుంది. అనుకోని కారణాలతో వారిలో ఎవరైనా తప్పుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారట.