Advertisementt

సేమ్‌ సీన్‌ టు సీన్‌ దించేస్తున్నారు..!

Mon 02nd Oct 2017 03:34 PM
arjun reddy movie,actress shalini pandey,100% kadal movie,naga chaitany,100% love movie  సేమ్‌ సీన్‌ టు సీన్‌ దించేస్తున్నారు..!
Shalini Pandey New Project '100 % kadhal' Movie సేమ్‌ సీన్‌ టు సీన్‌ దించేస్తున్నారు..!
Advertisement
Ads by CJ

అటు సుకుమార్‌కి, ఇటు నాగ చైతన్యకి కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచి వారి కెరీర్‌కి ఊతమిచ్చిన చిత్రంగా '100% లవ్‌'ని చెప్పుకోవచ్చు.కాగా ప్రస్తుతం ఈచిత్రం తమిళంలో రీమేక్‌ అవుతోంది.ఏ ఆర్‌ రెహ్మాన్‌ మేనల్లుడు, సంగీత దర్శకుడు జివి.ప్రకాష్‌ ఇందులో హీరోగా నటిస్తూ సంగీతం కూడా అందిస్తున్నాడు. ఇక తమన్నా నటించిన మహాలక్ష్మి పాత్రలో 'అర్జున్‌ రెడ్డి' ఫేమ్‌ షాలిని పాండే నటిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు చంద్రమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

సుకుమార్‌ సమర్పణలో భువన చంద్రమౌళి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి టైటిల్‌ని కూడా '100% కాదల్‌' అనే పేరును పెట్టారు. తాజాగా చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.తెలుగులో తమన్నా నడుముపై ఉన్న లెక్కలను నాగ చైతన్య కాపీ కొట్టే సీన్‌ని యాజిటీజ్‌గా దించేసి షాలిని పాండే నడుముపై ఉన్న ఫార్ములాలను జీవి ప్రకాష్‌ తన స్టైల్‌లో కాపీ కొడుతున్నాడు. 

ఇక ఈ చిత్రంలో షాలిని పాండే సరికొత్తగా కనిపిస్తోంది. తీరా చూస్తే ఈచిత్రాన్ని తెలుగులో ఉన్న సీన్స్‌నే ఉన్నది ఉన్నట్లుగా కాపీ పేస్ట్‌ చేస్తున్నారేమోనన్న అనుమానం రాకమానదు. అక్టోబర్‌ 11న షూటింగ్‌ ప్రారంభించుకునే ఈచిత్రం వచ్చే వేసవి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. 

Shalini Pandey New Project '100 % kadhal' Movie:

Bhuvan Chandramauli is producing the film under Sukumar's submission. The title is '100% Kadhal'.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ