Advertisementt

రంగస్థలం కోసం ఐటెంని పట్టేశారు!

Thu 05th Oct 2017 10:46 AM
ram charan,duvvada jagannadham fame,pooja hegde,item song,rangasthalam 1985  రంగస్థలం కోసం ఐటెంని పట్టేశారు!
Pooja Hegde Special Song in Rangasthalam 1985 రంగస్థలం కోసం ఐటెంని పట్టేశారు!
Advertisement
Ads by CJ

సుకుమార్ సినిమాల్లో ఐటెంసాంగ్స్ కి ఎంతగా ఇంపార్టెన్స్ ఉంటుందో అతగాడి గత సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో ఆ ఐటెం సాంగ్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే సుకుమార్ కూడా తన సినిమాల్లో అదిరిపోయే ఐటెంసాంగ్స్ కోసం ప్లాన్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985  లో ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ కోసం ప్లాన్ చెయ్యడం... దానికి సంబందించిన ఐటెం భామను పట్టుకోవడం జరిగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. 

సుకుమార్ రంగస్థలంలో రామ్ చరణ్ తో ఐటెం సాంగ్ లో ఆడి పాడడానికి దువ్వాడ జగన్నాధం హీరోయిన్ పూజ హెగ్డేని సెలెక్ట్  చెయ్యడం... దానికి సంబంధించి పూజ హెగ్డే తో అగ్రిమెంట్స్ చేసుకోవడము జరిగిపోయినట్లుగా చెబుతున్నారు. డీజేలో అల్లు అర్జున్ తో పోటీగా స్టెప్స్ వేసిన పూజ డాన్సింగ్ స్కిల్స్ నచ్చి సుకుమార్ ఈ ఐటెం కోసం పూజని తీసుకున్నాడట. మరి ఇప్పటికే హీరోయిన్ సమంత సన్నివేశాలు రంగస్థలంలో పూర్తి కాగా.. ఇప్పుడు మిగిలిన నటీనటులకు సంబందించిన సన్నివేశాలతో పాటు పూజ హెగ్డే తో ఈ ఐటెం సాంగ్ కూడా తెరకెక్కిస్తాడట. 

ఇక రామ్ చరణ్ కూడా ఈ ఐటెం సాంగ్ కోసం పూర్తి కసరత్తులు ప్రారంభించడమే కాదు... దాని కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ఇక రంగస్థలంలో ఐటెం అవకాశం దొరకడంతో పూజ హెగ్డే ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంటున్నారు. మరి అంతేగా రెండు రోజులు ఐటెం కోసం కష్టపడితే ఒక సినిమాకి సంపాదించినంత దండుకోవచ్చు. అందుకే ఆ మాత్రం హ్యాపీ నెస్ ఉంటుందిలే.

Pooja Hegde Special Song in Rangasthalam 1985:

Pooja Hegde with Ram Charan in Rangasthalam 1985 Item Song 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ