Advertisementt

బహుశా.. యంగ్ సీఎం లు ఇలానే ఉంటారేమో?

Fri 06th Oct 2017 03:49 PM
bharath anu nenu,chief minister,mahesh babu,koratala siva,mahesh babu cm avathar  బహుశా.. యంగ్ సీఎం లు ఇలానే ఉంటారేమో?
Koratala Siva Bharat Anu Nenu Mahesh Babu New Look బహుశా.. యంగ్ సీఎం లు ఇలానే ఉంటారేమో?
Advertisement
Ads by CJ

మురుగదాస్ దర్శకత్వంలో నటించిన స్పైడర్ తో బాగా దెబ్బతిన్న మహేష్ కొద్దీ రోజులు ఇటలీ టూర్ కి వెళ్ళాడు. అక్కడ భార్య పిల్లలతో ఫ్రెష్ అప్ అయ్యాక తన తదుపరి చిత్రం భరత్ అనే నేను చిత్ర షూటింగ్ లో జాయిన్ అవుతాడు. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన కొరటాల శివతో మహేష్ బాబు ఇప్పుడు భరత్ అనే నేను చిత్రాన్ని చేస్తున్నాడు. మరి ఈ చిత్రంలో మహేష్ ఎన్నడూలేని విధంగా కొత్తగా ఒకరాష్ట్రానికి సీఎం స్థానంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నాడు.

పొలిటికల్ నేపధ్యంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను చిత్రం షూటింగ్ అప్పుడే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలోని అసెంబ్లీ సెట్ లో భరత్ అనే నేను సినిమా షూటింగ్ జరుపుకుంది. ఇక ఈచిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి గెటప్ ఎలా వుండబోతుందో అనే ఆశగా ఎదురు చూస్తున్న మహేష్ అభిమానులకు ఇప్పుడు ఆ చిత్రంలోని మహేష్ లుక్ ఒకటి బయటికి రావడంతో దాన్ని చూసిన మహేష్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఆ లుక్ లో మహేష్ సీఎం గా ఎలా ఉంటాడో అర్ధమైపోయింది.

ఫార్మల్ డ్రస్సులో ఉన్న మహేష్ చూడడానికి ఏమంత కొత్తగా కనబడటం లేదు. ఎప్పటిమాదిరిగానే చాలా అందంగా... స్టైలిష్ గా కనబడుతున్నాడు. మరి ఈ చిత్రంలో మహేష్ లుక్ చూస్తుంటే మాత్రం స్టైలిష్ సీఎం అనకుండా ఉండలేము. ఇక మహేష్ పక్కన ఉన్న సెక్యూరిటీ.... అలాగే మహేష్ వెనకాల సెక్రటరీ ఇలా సెటప్ అంతా చూస్తుంటే మాత్రం మహేష్ సీఎంగా వెలిగిపోతున్నట్లే కనబడుతున్నాడు. మరి ఒక ఏజ్ లో సీఎంలు అయితే వైట్ అండ్ వైట్ తోనో లేకుంటే పంచెకట్టుతోనో, లేకుంటే కుర్తా పైజామాతోనో కనబడతారు. మరి కుర్ర సీఎం లు అయితే ఇలా మహేష్ లాగే ఫార్మల్ డ్రస్సులో కనబడతారు కదా అంటున్నారు మహేష్ అభిమానులు.

Koratala Siva Bharat Anu Nenu Mahesh Babu New Look:

Mahesh Babu Chief Minister Look From Bharath Anu Nenu 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ