సినీ తారల వైవాహిక జీవితాలు నీటిలో బుడగలవంటివని అంటారు. మరి అందరి పరిస్థితి అలాగే ఉంటుందా? అంటే 90శాతం మంది పెళ్లిళ్లు పెటాకులు కావడానికి మనకి కనిపించే కారణాలు మూడు. పెళ్లయిన తర్వాత కూడా నటిస్తానని అంటే భర్తలు ఒప్పుకోకపోవడం... హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా క్రేజ్‌లో ఉంటే వారి ఇమేజ్‌ని చూసి తమను తాము తక్కువగా చేసుకున్న ఇంటీరియారిటీ కాంప్లెక్స్.. మూడోది తన డబ్బును, తాను కష్టపడి కూడబెట్టుకున్నదానిని భర్త లేదా ఆయన కుటుంబీకులకు తమ సొంతం కోసం వాడుకోవడం అనేవి ముఖ్యం. అయితే పెళ్లయిన మొదట్లో మాత్రం వారు అన్యోన్యంగా ఉంటారు.
ఇక తెలుగులో 'పెళ్లయిన కొత్తలో' అనే సినిమాలో నటించిన హీరోయిన్ ప్రియమణి విషయానికి వస్తే ఆమె అద్భుతనటి. 'పరుత్తివీరన్' ద్వారా నేషనల్ అవార్డును సాధించింది. ఆ తర్వాత తెలుగులో టాప్‌స్టార్స్‌తో కలసి నటించింది. ఇక నాడు ఆమెకు జగపతిబాబుతో ఎఫైర్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఇక తన కెరీర్ ఎండింగ్ అన్న స్టేజీలో ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించింది. చివరకు ప్రేమించి, పెళ్లి చేసుకుంది. అది కూడా ఒక ముస్లింని, ఆమె పెళ్లి ఎంతో నిరాడంబరంగా కేవలం ముగ్గురు నలుగురు సమక్షంలో రిజిష్టర్ మ్యారేజ్‌ని చేసుకుంది. ఆయన పేరు ముస్తాఫారాజ్. ఈయన ఓ ఈవెంట్ మేనేజర్. ఈయనకు సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ప్రియమణి పరిచయమైంది. అయితే అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. మొదట స్నేహంగా మొదలైంది. తర్వాత తనను చిన్నపిల్లలా భావించి ఆయన తన గురించి ఎంతో కేర్ తీసుకోవడం నచ్చింది. దాంతో చివరకు వారిద్దరు ఒకటయ్యారు.
కాగా ప్రస్తుతం ప్రియమణి మలయాళంలో మామూలు చిత్రాలలోనే కాదు హాట్ సీన్స్‌లో నటించాల్సిన మూవీస్‌లో కూడా భర్త అనుమతితో నటిస్తోంది. ఆయనకు కూడా ఆఫీస్‌లో పని లేకపోతే ఆమె షూటింగ్ చేసే సెట్స్‌కి వెళ్లి కూర్చుంటారట. ఇక తాను వివాహానికి ముందు పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాకి చెప్పే చేసుకుంది. దీనిపై ఆమె మాట్లాడుతూ, నా సంతోషాన్ని అందరితో పంచుకోవడానికి మీడియాకు ఈ విషయం చెప్పానే గానీ ముస్తాఫాని పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని అభిప్రాయం చెప్పడానికి మీడియాకు చెప్పలేదని వివరణ ఇచ్చింది. ఇక పెళ్లి తర్వాత ముస్లింని చేసుకున్నావా? అని పలువురు నెటిజన్లు ఆమెపై మండిపడ్డారట. ఇది నేను ముందే ఊహించానని చెప్పింది. నాకు నా భర్త, అతని కుటుంబీకులే ముఖ్యం. ఇతరులు ఏమనుకున్నా నాకు అనవసం అని తేల్చిచెప్పింది. తమ కుటుంబంలో సమీప బంధువు ఒకరు చనిపోవడం వల్లనే పెళ్లిని గ్రాండ్‌గా అందరినీ పిలిచి చేసుకోలేదని ముక్తాయింపునిచ్చింది.