Advertisementt

మళ్లీ రామ్ చరణ్ వల్ల రంగస్థలంకి బ్రేక్..!

Sat 07th Oct 2017 03:32 PM
rangasthalam 1985,mega power star,ram charan,break,coimbatore  మళ్లీ రామ్ చరణ్ వల్ల రంగస్థలంకి బ్రేక్..!
Ram Charan's One Week Break to Rangasthalam Shooting మళ్లీ రామ్ చరణ్ వల్ల రంగస్థలంకి బ్రేక్..!
Advertisement
Ads by CJ

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ 'రంగస్థలం 1985' చిత్రంలో నటిస్తున్నాడు. ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం గత వేసవిలో సమంతకి వడదెబ్బ తగలడం, అలాగే సుకుమార్ నిర్మించిన 'దర్శకుడు' చిత్రం ప్రమోషన్స్ కోసం రంగస్థలం షూటింగ్ కొద్ది రోజులు వాయిదా పడడం.. అలాగే చరణ్ కూడా తన తండ్రి 'సైరా' సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో కొద్ది రోజులు రంగస్థలాన్ని పక్కనపెట్టినప్పటికీ గత కొన్ని రోజులుగా రంగస్థలం 1985  షూటింగ్ నిర్విరామంగా జరుపుకుంటోంది. ఇప్పటికే హీరోయిన్ సమంతకి సంబంధించిన షూటింగ్ పూర్తవడంతో సమంత తన పెళ్లికోసం గోవా వెళ్ళిపోయింది.  

ఇక తర్వాత కూడా చరణ్ మీద కొన్ని సన్నివేశాలు నిర్విరామంగా తెరకెక్కించడంతో... రోజులు తరబడి షూటింగ్ తో హీరో రామ్ చరణ్ బాగా అలిసిపోవడంతో ఇప్పుడు ఒక వారం రోజులపాటు షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని హాయిగా సేదతీరబోతున్నాడట. ఇప్పటికే కోయంబత్తూరులో అడుగుపెట్టిన రామ్ చరణ్ అక్కడినుండి కేరళకు ప్రయాణమవుతున్నాడు. కోయంబత్తూరులో చరణ్ అక్కడ సద్గురు ఈషా ఫౌండేషన్ సెంటర్ లో కొంత సమయం గడిపాడు. ఈ సద్గురు ఎవరంటే... ఇటీవల హైదరాబాద్ లో రామ్ చరణ్ ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులకు స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని సూచనలు చేశారు.

అయితే కోయంబత్తూర్ నుండి చరణ్ కేరళకు వెళ్లి అక్కడ ఒక నేచర్ క్యూర్ సెంటర్ లో సేద తీరనున్నాడని చరణ్ సన్నిహితవర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక రామ్ చరణ్ తో పాటు రంగస్థలం యూనిట్ సభ్యులు కూడా కొంతమంది ఆ నేచర్ క్యూర్ సెంటర్ కి వెళుతున్నట్టుగా చెబుతున్నారు. ఇక చరణ్ రెస్ట్ పూర్తికాగానే రంగస్థలం మిగతా షూటింగ్ ని కూడా పూర్తి చేయనున్నాడు సుకుమార్. 

Ram Charan's One Week Break to Rangasthalam Shooting:

Mega Power Star Ram Charan One Week Break for Rangasthalam 1985 Movie Shooting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ