Advertisementt

చైతూకి హీరోయిన్ ని కూడా సెట్ చేశాడు!

Sun 08th Oct 2017 03:26 PM
anu emmanuel,naga chaitanya,savyasachi,maruthi,mahanubhavudu  చైతూకి హీరోయిన్ ని కూడా సెట్ చేశాడు!
Anu Emmanuel for Naga Chaitanya's Film! చైతూకి హీరోయిన్ ని కూడా సెట్ చేశాడు!
Advertisement
Ads by CJ

చైతన్య 'యుద్ధం శరణం' సినిమా తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ సినిమా అధికారికంగా మొదలైనప్పటికీ.. రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. ప్రస్తుతానికి నాగ చైతన్య... సమంతని పెళ్లి చేసుకునే పనిలో బిజీగా ఉండడంతో చందు మొండేటి సినిమా మొదలు కావడానికి ఇంకో 10 రోజులు సమయం పట్టేలా కనబడుతుంది. ఇప్పటికే సవ్యసాచి ప్రీ లుక్ తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత  నాగ చైతన్య దర్శకుడు మారుతితో మరో సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే మారుతీ - నాగ చైతన్య సినిమా మాత్రం వచ్చే డిసెంబర్ లోనే పట్టాలెక్కే ఛాన్స్ కనబడుతుంది.

ఇక మారుతీ కూడా చైతూ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మహానుభావుడు విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే నాగ చైతన్య సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టేశాడు మారుతి. అందులో భాగంగానే నాగచైతన్య కి అప్పుడే హీరోయిన్ ని కూడా సెట్ చేశాడు. నాగ చైతన్య - మారుతీ కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో చైతు సరసన అను ఇమ్మాన్యువల్ నటిస్తుంది. ప్రస్తుతానికి అను ఇమ్మాన్యువల్ పవన్ సరసన PSPK 25 లోను, అల్లు అర్జున్ సరసన 'నా పేరు సూర్య' చిత్రాలలో నటిస్తుంది. మారుతీ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగ చైతన్య - అను ఇమ్మాన్యువల్ ల రొమాన్స్ అదిరే లెవల్లో ఉండబోతుందన్నమాట. 

Anu Emmanuel for Naga Chaitanya's Film!:

Anu Emmanuel has been chosen for Naga Chaitanya's new venture to be helmed by Maruthi.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ