Advertisementt

యాక్సిడెంట్.. రాజశేఖర్ మద్యం సేవించలేదు!

Mon 09th Oct 2017 06:00 PM
actor rajasekhar car accident,hero rajasekhar,ramireddy,road accident  యాక్సిడెంట్.. రాజశేఖర్ మద్యం సేవించలేదు!
Hero Rajasekhar Injured in Road Accident యాక్సిడెంట్.. రాజశేఖర్ మద్యం సేవించలేదు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరో రాజశేఖర్ కారు గత రాత్రి అంటే ఆదివారం రాత్రి  ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ముందువెళ్తున్న కారును ఢీ కొట్టింది. రాజశేఖర్ కారు రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్‌  కారుని ఢీకొట్టడంతో అతని కారుకి డ్యామేజ్ అయ్యింది గాని.. కారులో ఉన్న వ్యక్తి రామిరెడ్డికి గాని, రాజశేఖర్ కి గాని ఎటువంటి ప్రమాదంలేదని పోలీస్ లు చెబుతున్నారు. అయితే తన కారుని రాజశేఖర్ డ్యామేజ్ చేసిన కారణంగా రామిరెడ్డి అనే వ్యక్తి రాజశేఖర్ పై మాటల యుద్దానికి దిగడంతో రాజశేఖర్ కి రామిరెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

రాజశేఖర్ ఫుల్ గా మందు కొట్టి కారుని నడుపుతూ తన కారుని ఢీ కొట్టాడని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు రాజశేఖర్ మద్యం తీసుకున్నాడా? లేదా? అనే విషయాన్ని బ్రీత్ అన్‌లైజర్ పరీక్షలు నిర్వహించగా అందులో రాజశేఖర్ మద్యం సేవించలేదని తేలిందని.. కేవలం హీరో రాజశేఖర్ తన తల్లి చనిపోయిందనే డిప్రెషన్ లోనే ఉండి కారు నడపడంతో ఈ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తెలుపుతున్నారు. ఇక రామిరెడ్డితో రాజశేఖర్ కుటుంబ సభ్యులు మాట్లాడి రాజి కుదర్చడంతో ఈ వివాదం సద్దుమణిగిందని తెలుస్తోంది.

Hero Rajasekhar Injured in Road Accident :

Actor Rajasekhar Has A Narrow Escape In Car Accident

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ