Advertisementt

ఫొటో: అప్పుడే పుట్టిన కొడుకుతో పవన్!

Tue 10th Oct 2017 11:29 PM
pawan kalyan,anna lezhneva,baby boy,pawan kalyan with new born child  ఫొటో: అప్పుడే పుట్టిన కొడుకుతో పవన్!
Pawan Anna blessed with Baby Boy ఫొటో: అప్పుడే పుట్టిన కొడుకుతో పవన్!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ నాన్నయ్యాడు. పవన్ కళ్యాణ్ - అన్నాలేజ్నేవా దంపతులకు పండంటి మగ పిల్లాడు పుట్టాడు. తన వారసుణ్ణి పవన్ కళ్యాణ్ తన చేతుల్లోకి తీసుకుని ఆ క్షణాన్ని ఎంతో ఆనందించాడనే విషయం ఈ ఫోటో ద్వారా అర్ధమవుతుంది. పవన్ కి ఈ బాబు మొదటి బిడ్డ కాదు. పవన్ కళ్యాణ్ కి ఇదివరకే ఒక బాబు అకీరా నందన్, ఒక పాప ఆధ్యా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన లైఫ్ లో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య నందినికి పిల్లలు లేరు. ఆమెతో విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ సహా నటి రేణు దేశాయ్ ని ప్రేమించి ఒక బిడ్డ కు తండ్రయ్యాక ఆ బిడ్డ సాక్షిగా రేణుని వివాహమాడాడు. రేణు దేశాయ్ - పవన్ కళ్యాణ్ పెళ్లి తర్వాత వారికీ మరో పాప పుట్టింది.

ఇక రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్.. మూడో భార్యగా చెప్పబడే అన్నాలేజ్నేవా తో సహజీవనం చేస్తున్నాడు. ఇప్పడు అన్నా లేజ్నేవా కి - పవన్ కళ్యాణ్ కి ఒక బాబు పుట్టాడు. దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ కి మరో వారసుడొచ్చేసాడు. రేణు దేశాయ్ తో అకీరా నందన్ కి తండ్రయి వారసుణ్ణి ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్నా తో మరో వారసుణ్ణి ఎత్తుకున్నాడు. మరి ఆ వారసుడు రాకతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ, సినిమాల్లో అనుకున్నంత సక్సెస్ లు సాధిస్తాడేమో  చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఎత్తుకుని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Pawan Anna blessed with Baby Boy:

Power Star Pawan Kalyan and Anna Lezhneva became proud parents to a baby boy earlier today in Hyderabad. Both the mother and baby boy are said to be perfectly fine.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ