Advertisementt

అర్జున్ రెడ్డితో అదృష్టం అలా పట్టేసింది మరి..!!

Wed 11th Oct 2017 05:28 AM
arjun reddy,sandeep vanda,mythri movie makers,advance  అర్జున్ రెడ్డితో అదృష్టం అలా పట్టేసింది మరి..!!
Mythri Movie Makers Advance to Arjun Reddy Director అర్జున్ రెడ్డితో అదృష్టం అలా పట్టేసింది మరి..!!
Advertisement
Ads by CJ

ఒకే ఒక్క హిట్టుతో ఇప్పుడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా పేరు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఒక్క సినిమా హిట్ తోనే సందీప్ కోట్లకు పడగెత్తేశాడు.  పలువురు నిర్మాతలు సందీప్ తో సినిమా చెయ్యడానికి ఆసక్తి కనబర్చడమే కాదు అతనికి అడ్వాన్స్ లు కూడా ఇచ్చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సూపర్ హిట్ తో పండగ చేసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా తన నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చెయ్యాలి.. అసలు ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనే క్లారిటీ లేదు. మరి హీరోని, కథని ఫిక్స్ చెయ్యకపోయినా మనోడికి తన నెక్స్ట్ సినిమా కోసం 50 లక్షల అడ్వాన్స్ చేతిలో పడిపోయింది.

అర్జున్ రెడ్డి సినిమా హిట్ తో మంచి ఉత్సాహంతో ఉన్న ఈ దర్శకుడితో సినిమా కోసం నిర్మాతలు ఎగబడుతున్నారనే విషయం తెలిసిందే. అయితే అందరి నిర్మాతలలో ఒక అడుగు ముందుంది మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ. టాలెంట్ ను ఒడిసిపట్టుకోవడంలో... కాంబినేషన్లు క్రియేట్ చేయడంలో తమకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యానర్ సందీప్ కి అప్పుడే గేలం వేసింది. అందుకే అనుకున్నదే తడవుగా సందీప్ వంగా చేతిలో 50లక్షలు పెట్టింది. ఒక మంచి కథ పట్టుకొని వస్తే హీరోను తామే సెట్ చేస్తామని సందీప్ కి హామీ కూడా ఇచ్చింది.

అయితే మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ప్రస్తుతం పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నితిన్ లాంటి బడా హీరోల కాల్షీట్లు ఉన్నాయి. సందీప్ వంగ కనుక మంచి కథ పట్టుకుని వస్తే ఈ హీరోలలో ఎవరితోనైనా సందీప్ కి సినిమా చేసే అవకాశం వరించొచ్చు. కేవలం బడా స్టార్ తో సినిమా చేసే అవకాశమే కాదు ఆ హీరోతో పాటే భారీ పారితోషికం కూడా పట్టెయ్యొచ్చు. మరి కేవలం అర్జున్ రెడ్డి క్రేజ్ ఒక్క విజయ్ దేవరకొండకే లేదు. ఆ సినిమా దర్శకుడికి కూడా బాగానే ఉందనే విషయం ఈ ఆఫర్ ద్వారా తెలుస్తుంది.

Mythri Movie Makers Advance to Arjun Reddy Director:

Sandeep Vanga Changed Busy Director with Arjun Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ