ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చిన యువ కమెడియన్ జోష్ రవి అప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు. తనను చూసిన వారెవ్వరూ కమెడియన్ అని అనుకోరట. బహుశా ఆయన ఉద్దేశ్యంలో హీరో అనుకుంటారు కాబోలు. తనకి కమెడియన్‌గా నటించాలని పెద్దగా ఆసక్తి లేదని, అందుకే మంచి క్యారెక్టర్ రోల్స్, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేయాలని అంటున్నాడు.
ఇంకా మాట్లాడుతూ, ఏకంగా 'స్పైడర్' చిత్రంలోని విలన్ క్యారెక్టర్ అయిన ఎస్.జె.సూర్య స్థాయిలో తాను రాణించగలనని, కానీ ఆ చాన్స్‌లు రావాలంటే నాకెంతో కొంత ఇమేజ్ ఉండాలని చెబుతున్న రవి, మంచి హిట్టు పడితే గానీ ఆ ఇమేజ్ రాదు అంటున్నాడు. మరి ఆ ఇమేజ్ రావడానికి కారణమయ్యే అద్భుతమైన పాత్రను ఎవరో ఒకరు నమ్మి నాకు ఇవ్వాలి.. అంటూ పెద్ద పెద్ద మాటలే చెబుతున్నాడు. నిజానికి సినిమాలలో మొదట చిన్న చిన్న పాత్రలు రావడమే అదృష్టం. వచ్చినవాటిని సద్వినియోగం చేసుకుంటూ వెళ్లాలి కానీ ఇప్పుడు కామెడీ పాత్రలు వస్తే నేను చేయడం లేదు.. అని ఆయన చెప్పడాన్ని చూస్తుంటే ఇదేదో ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలుగా చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆర్.నారాయణమూర్తి, విజయ్‌దేవరకొండ వరకు అందరూ చిన్న పాత్రలు చేస్తూ ఎదిగిన వారేనని గుర్తించాలి. అంతేగానీ మొదట్లోనే పెద్ద హిట్స్ కావాలంటే సచిన్‌జోషిలా డబ్బయినా ఉండాలి. లేక వారసులైనా ఉండాలి. మిగిలిన అందరూ ఒక్కోమెట్టు ఎక్కుతూ తమను తాము నిరూపించుకునే వారేనని ఈ జోష్ రవికి ఇంకా అర్దమైనట్లు లేదు.