Advertisementt

సిద్దార్ధ్‌ లిప్‌లాక్‌ తో నిజంగానే భయపెట్టాడు!

Wed 11th Oct 2017 02:08 PM
siddharth gruham trailer,siddharth,gruham,andrea jeremiah,lip lock  సిద్దార్ధ్‌ లిప్‌లాక్‌ తో నిజంగానే భయపెట్టాడు!
Positive Response on Siddharth Gruham Trailer సిద్దార్ధ్‌ లిప్‌లాక్‌ తో నిజంగానే భయపెట్టాడు!
Advertisement
Ads by CJ

తెలుగులో 'నువ్వొస్తాంటే.. నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం' వంటి చిత్రాలతో సత్తాచాటిన నటుడు సిద్దార్ద్‌. సిద్ధార్థ్ కు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించాడు. ఇక ఆయన 'అరణ్మణై2' తర్వాత చాలా కాలం గ్యాప్‌ తీసుకున్నాడు. తాజాగా ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'అవళ్‌' (తెలుగులో 'గృహం') అనే హార్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని తన ఎడాకీ, వయోకామ్‌18 మోషన్‌ పిక్చర్స్‌ బేనర్‌తో కలిసి చేస్తుండటం విశేషం. 

కాగా సిద్దార్ద్‌తో 17ఏళ్లగా మంచి మిత్రుడైన మిలింద్‌ దర్శకత్వంలో ఈచిత్రం రూపొందుతుండగా, కథను సిద్దార్దే తయారు చేశాడు. ఇక ఈ చిత్రం హాలీవుడ్‌ స్థాయిలో ఉంటుందని సిద్దార్ద్‌ అంటున్నాడు. సాధారణంగా తన సినిమాల గురించి విడుదలకు ముందే గొప్పలు చెప్పే అలవాటు లేని, ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉండాలని భావించే తపన ఎక్కువగా ఉన్న సిద్దార్ద్‌ తాను ఎప్పటినుంచో హాలీవుడ్‌ స్థాయిలో చిత్రం రూపొందించాలని భావిస్తున్నట్లు గా ఆ మధ్య చెప్పుకొచ్చాడు. 

'నిజానికి హాలీవుడ్‌ హర్రర్‌ చిత్రాలను నేను బాగా చూస్తాను. ఎప్పటికైనా హాలీవుడ్‌ హర్రర్‌ స్థాయి చిత్రం తీయాలనే కోరిక దీనితో నెరవేరింది..' అని చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ నిజంగానే బాగా భయపెడుతోంది. ఇక ఈ ట్రైలర్‌లో సిద్దార్ద్‌, ఆండ్రియా మద్య వచ్చే లిప్‌లాక్‌ మాత్రం హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందని అర్ధమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని నవంబర్‌ 3వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Click Here to See the Gruham Trailer 

Positive Response on Siddharth Gruham Trailer:

Siddharth's comeback film Gruham will scare the hell out of you

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ