Advertisementt

చైతూ, సమంతలలో పెద్దరికం కనబడుతోంది!

Wed 11th Oct 2017 03:23 PM
naga chaitanya,samantha,after marriage,photo talk,chaitu and samantha  చైతూ, సమంతలలో పెద్దరికం కనబడుతోంది!
Naga Chaitanya and Samantha Photo Sensation in Social Media చైతూ, సమంతలలో పెద్దరికం కనబడుతోంది!
Advertisement
Ads by CJ

ఎంత చిన్నవారైనా, ఎంతటి అల్లరి చిలిపి చేష్టలు చేసిన వారైనా సరే వివాహం జరిగితే ఒక్కసారిగా తమకు తాము తెలియకుండానే హుందాగా మారి, పెద్దరికంగా కనిపిస్తూ ఉంటారు. ఇక నిన్నటివరకు అల్లరి పిల్లగా పేరుతెచ్చుకున్న సమంతకు మూడు రోజుల కిందటే గోవాలో హిందు, క్రిస్టియన్‌ సంప్రదాయాలలో వివాహం జరిగిన తెలిసిందే. కేవలం ఇరుకుటుంబాలకు చెందిన 150మంది అత్యంత సన్నిహితుల మద్య వీరి వివాహం జరిగింది. కానీ త్వరలో సినీ ప్రముఖులందరినీ పిలిచి, హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్‌ ఇవ్వనున్నారు. 

ఇక వీరి వివాహం సందర్భంగా కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో సురేష్‌బాబు, సమంతలు కలిసి తీన్మార్‌ డ్యాన్స్‌ చేస్తున్న ఫొటో, డిస్కోలైట్ల మద్య నాగార్జున, వెంకటేష్‌లు చేసిన హంగామా ఫొటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. అయితే తాజాగా పెళ్లికొడుకు నాగచైతన్య, పెళ్లికూతురయిన సమంతలు తీసుకున్న ఫొటోకి మాత్రం మంచి స్పందన లభిస్తోంది. 

ఇందులో నాగచైతన్య, సమంతలు ఎంతో హుందాగా మెరిసిపోతున్నారు. ముఖ్యంగా ఎర్రటి దుస్తుల్లో ఉన్న సమంత మెరిసిపోతూ ఉండగా, ఆమె మెడలోని తాళిబొట్టుతో నవ్వులు చిందిస్తూ ఉంది. ఇక ఈ ఫోటోని ఆ నవదంపతులు ప్రత్యూష ఆర్గనైజేషన్‌ డాక్టర్‌ మంజులతో దిగిన ఫొటో కావడంతో ఈ ఫొటోని చూసిన వారు తెర మీద కంటే పెళ్లయిన తర్వాత వీరిద్దరు దిగిన ఈ ఫొటోనే సూపర్బ్‌గా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. 

Naga Chaitanya and Samantha Photo Sensation in Social Media:

Naga Chaitanya and Samantha After Marriage Photo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ