'శిరిడీ సాయి, ఓం నమో వేంకటేశాయ' చిత్రాలను నిర్మించిన మహేష్‌రెడ్డి, కామాక్షిఆర్ట్స్ డి.శివప్రసాద్‌రెడ్డిలకు నాగార్జున అంటే ఎంతో ఇష్టం. అయితే వీరు నాగ్ తో సినిమాలు చేసి చాలా లాస్ అయ్యారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత నాగ్ కి ఉంది. ఇక నాగ్ బాధితుల్లోకి అశ్వనీదత్ కూడా చేరుతాడు. ఎందుకంటే ఆయన నాగార్జునతో తీసిన 'గోవిందా గోవిందా, రావోయి చందమామ' చిత్రాలు డిజాస్టర్స్ కాగా 'ఆజాద్' సినిమా బాగున్నా బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది.
ఇక అశ్వనీదత్ పతనంలో ఆయన తనకు తిరుగులేదు అని బాలయ్యతో తీసిన 'అశ్వమేధం', వెంకటేష్ 'సుభాస్‌చంద్రబోస్', చిరంజీవి 'జై చిరంజీవ', ఎన్టీఆర్‌తో 'కంత్రి, శక్తి', మహేష్‌బాబుతో 'సైనికుడు'వంటి చిత్రాలే గాక ఇదే లిస్ట్‌లో పవన్ సినిమా కూడా ఒకటి ఉంది. దీంతో కొంతకాలంగా ఆయన సైలెంట్ గానే వున్నాడు. ఇక తాజాగా అశ్వనీదత్ మరలా నిర్మాతగా రాణించేందుకు పావులు కదుపుతున్నాడు. ఆల్‌రెడీ మహేష్ హీరోగా దిల్‌రాజుతో కలిసి ఓ చిత్రం చేయడానికి ఒప్పించాడు. మరోవైపు 153వ చిత్రంగా చిరంజీవితో చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఇదే వరసలో ఇప్పుడు అశ్వనీదత్ వైవిధ్య చిత్రాలతో దూసుకెళ్తున్న కింగ్ నాగార్జున, మినిమం గ్యారంటీ హీరోగా దూసుకెళ్తున్న నేచురల్‌స్టార్ నానిల కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రాన్ని కూడా చేజిక్కించుకున్నాడని వార్తలు వస్తున్నాయి. 'శమంతకమణి' చిత్రంలో నలుగురు యంగ్ హీరోలను బాగానే బ్యాలెన్స్ చేసిన శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. దీనితో పాటు సావిత్రి బయోపిక్‌గా అశ్వనీదత్ తన కుమార్తెలతో 'మహానటి' చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాలు అశ్వనీదత్‌కి, వైజయంతి మూవీస్‌కి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో వేచిచూడాల్సివుంది...!