Advertisementt

సమంత పేరు కూడా మార్చేసుకుంది!

Thu 12th Oct 2017 11:04 PM
samantha,akkineni samantha,name changed,rahamath nagar  సమంత పేరు కూడా మార్చేసుకుంది!
Samantha Gets Her Surname Changed సమంత పేరు కూడా మార్చేసుకుంది!
Advertisement
Ads by CJ

నాగచైతన్యని ప్రేమించి పెళ్లాడిన సమంత అధికారికంగా అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. నాగార్జున కోడలిగా సమంత ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో చలామణి అవుతుంది. చైతూతో ప్రేమాయణం మొదలు అక్కినేని కుటుంబంలో ఒకదానిగా  మెసులుతున్న సమంత హిందూ.. క్రిష్టియన్ సాంప్రదాయాల్లో నాగచైతన్యని మనువాడింది. హిందూ సాంప్రదాయంలో మేడలో తాళితో వెలిగిపోయిన సామ్.... క్రిష్టియన్ సాంప్రదాయంలో చైతుతో ఉంగరం తొడిగించుకుంది. ఈపెళ్ళితో సమంత రూతు ప్రభు కాస్తా అక్కినేని సమంతగా మారిపోయింది.

అయితే అక్కినేని ఇంటికోడలిగా అడుగుపెడుతున్న సమంత అందరిలా ఇంటిపేరు అక్కినేనిగా మార్చుకుంటుందా లేకుంటే సమంతగా ఎప్పటిలానే ఉంటుందా అనే డైలమాలో ఉన్నారు కొందరు. అయితే సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా సోషల్ మీడియాలో తనకి పెళ్లి శుభాకాంక్షలు చెప్పిన అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే ఈ బుధవారం అధికారికంగా తన ఇంటిపేరుని అక్కినేనిగా మార్చుకున్నట్టుగా ట్విట్టర్ ఎకౌంటులో తన పేరును మార్చేసుకుంది. 

సమంత రూతు ప్రభు  అని ఉన్న ఆమె పేరును ఇప్పుడు సమంత అక్కినేని అని మార్చుకుంది. మరి సమంత స్పెషల్ గా ఉండకుండా అందరి అమ్మాయిల మాదిరిగానే  ఆడపిల్లకి పెళ్లితో పాటు ఇంటిపేరు మార్చుకున్నట్టే సమంత కూడా సగటు ఆడపిల్ల మాదిరిగానే తన ఇంటిపేరు మార్చుకుని  అక్కినేని కోడలి హోదాని ఎంజాయ్ చేస్తుంది. 

Samantha Gets Her Surname Changed:

Samantha too got her surname changed. She changed her name in twitter profile as Samantha Akkineni from Samantha Ruth Prabhu.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ