హరితేజ అంటే ఒకప్పుడు టివి సీరియల్స్ లో నటించే ఒక నటి. ఆ అర్వాత ఈటీవి ప్లస్ లో చిన్న చిన్న షోలకు యాంకరింగ్ చేసుకునే హరితేజ సినిమాల్లోనూ మెరుస్తూండేది. దర్శకుడు త్రివిక్రమ్ అయితే తన 'అ.. ఆ' సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చి హైలెట్ చేశాడు. అప్పటినుండి హరితేజ సూర్యకాంతంగా హైలెట్ అయ్యింది. ఇక ఇప్పుడు తాజాగా హరితేజ అనగానే బిగ్ బాస్ రియాలిటీ షో గుర్తుకు వచ్చేస్తుంది. హరితేజ బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టింది మొదలు ఎంతో యాక్టివ్ గా స్పోర్టివ్ గా వుంటూ అందరితో స్నేహంగా, అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ నవ్విస్తూ, కవ్విస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపింది. బిగ్ బాస్ విన్నర్ గా బిగ్ బాస్ హౌస్ నుండి హరితేజ బయటికి వస్తుందని అందరు అనుకున్నారు కానీ అనూహ్యంగా శివబాలాజీ బిగ్ బాస్ విన్నరయ్యాడు.
అయితే హరితేజాకు నెంబర్ వన్ పొజిషన్ రాకపోయినా రావాల్సినంత క్రేజ్ రానే వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ వ్యాఖ్యాత ఎన్టీఆర్ కి కూడా ఇష్టమైన కంటెస్టెంట్ హరితేజ అనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే హరితేజకి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే అనేక అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే హరితేజ హోస్ట్ గా జెమిని ఛానల్ వాళ్ళు ఫిదా ప్రోగ్రాం ని ఫిక్స్ చెయ్యగా ఇప్పుడు హరితేజని మరో బంపర్ అవకాశం వరించినట్లుగా ప్రచారం స్టార్ట్ అయ్యింది. అదేమిటంటే కామెడీ షోలకు రారాజుగా ఉన్న జబర్దస్త్ లోకి హరితేజ యాంకర్ గా ఎంటర్ కానుందట. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ ఈ టీవీలో గురు, శుక్రవాల్లో ప్రసారమవుతున్న ఈ షోకి గురువారం అనసూయ యాంకరింగ్ చేస్తే... శుక్రవారం రష్మీ యాంకరింగ్ చేస్తుంది.
అయితే ఇప్పుడు యాంకర్ రష్మీ స్థానంలోకి హరితేజ ఎంట్రీ ఇవ్వనుందంటున్నారు. రష్మికున్న సినిమాల కమిట్మెంట్స్ కి, ఆమెకి సరిగా తెలుగు రాకపోవడం... ఈ మధ్య షోని డల్ గా నడిపించడం వంటి కారణాలతో రష్మిని తప్పించి ఆమె స్థానంలోకి హరితేజని తీసుకోవాలనే ప్లాన్ లో మల్లెమాల నిర్మాతలు ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి. హరితేజాకున్న మల్టీటాలెంటెడ్.. ఆమె ఏ షో అయినా ఎంటర్టైన్ చేసే విధానాన్ని చూసి ఆ ఛాన్స్ ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. మరి నిజంగానే ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా హరితేజ వస్తే గనక ఆ షో కున్న క్రేజ్ మరింతగా పెరిగే సూచనలున్నాయంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో?