మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరుతెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ తన సినీ కెరీర్ మొదట్లో తన చిత్రం యూనిట్‌లో ఒకరైన రీనాదత్‌ని 1989లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు పుష్కరకాలం కాపురం చేసిన తర్వాత ఆయన రీనాదత్‌కి విడాకులిచ్చి కిరణ్‌రావ్‌ని వివాహమాడాడు. తాజాగా అమీర్ మొదటి భార్య రీనాదత్ 50వ పుట్టినరోజు వేడులు జరిగాయి. వాస్తవానికి అంతకు ముందు రెండు మూడు రోజుల కిందటే తన తాజా చిత్రం షూటింగ్ కోసం విదేశాలకి వెళ్లి ముంబై తిరిగి వచ్చిన ఆయన వివిధ షెడ్యూల్స్‌లో బిజీగా ఉన్నాడు. కానీ తన మొదటి భార్య రీనాదత్ బర్త్‌డే ముందు రోజు ఆయనకు వారిద్దరి పిల్లల నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అమీర్-రీనాదత్ దంపతులకు పుట్టిన ఈ ఇద్దరు పిల్లలు తమ తల్లి బర్త్‌డేని సర్‌ప్రైజింగ్‌గా చేయాలని, ఆమె 50వ బర్త్‌డే వేడుకలు తమ తల్లి జీవితంలో మర్చిపోలేని గుర్తుగా మిగిలిపోవాలని వారి నాన్న అమీర్‌ని వారి పిల్లలు కోరారు.
దాంతో ఆయన తనకున్నషెడ్యూల్స్ అన్ని వాయిదా వేసుకుని తన కొత్త భార్య కిరణ్‌రావ్‌తో కలిసి జంటగా వెళ్లి పిల్లల సమక్షంలో తన మొదటి భార్య చేత కేక్ కట్ చేయించి, షాంపెన్‌ని ఓపెన్ చేసి ఎంతో హడావుడి చేశాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. విశేషం ఏమిటంటే.. ఈ బర్త్‌డే కనే కాదు.. విడిపోయిన తర్వాత కూడా అమీర్, ఆయన రెండోభార్య కిరణ్‌రావులు తరచుగా రీనాదత్ ఇంటికి వెళ్లి వస్తూ ఉంటారు. రెండో భార్య కిరణ్‌రావుకి మొదటి భార్య రీనాదత్‌కి కూడా మంచి స్నేహం ఉంది. దాంతో మాజీ భార్య బర్త్‌డేకి ఈ మాజీ మొగుడు చూపించిన ఉత్సాహం, సంతోషం హాట్‌టాపిక్‌గా మారింది. మరి మన పవన్ కూడా అలాగే చేస్తే బాగుంటుంది కదా...! అనిపిస్తోంది కదూ...!