Advertisementt

సమంత అలా అందా! లైట్ తీసుకొండిలే!!

Fri 13th Oct 2017 05:27 PM
samantha,raju gari gadhi 2,controversy speech,nagarjuna,old movies  సమంత అలా అందా! లైట్ తీసుకొండిలే!!
Samantha Sensational Comments on Her Old Movies సమంత అలా అందా! లైట్ తీసుకొండిలే!!
Advertisement
Ads by CJ

పెళ్లి జరిగిన ఐదో రోజునే సినిమాల మీదనున్న కమిట్మెంట్స్ తో సమంత 'రాజు గారి గది2' ప్రమోషన్స్ కోసం వాలిపోయింది. గోవాలో 6 , 7  తేదీల్లో సింపుల్ అని చెప్పినా, నాగచైతన్య - సమంతల డెస్టినేషన్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో సమంత - నాగ చైతన్యలు వెలిగిపోతూ కనిపించడమే కాదు అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఈ వేడుకని నిర్వహించారు. అయితే సమంత పెళ్లి తర్వాత హనీమూన్ అవి ఇవి అంటూ టైం వేస్ట్ చేయకుండా తాను కమిట్ అయిన సినిమాలకు న్యాయం చెయ్యాలని... 'రాజు గారి గది2'  సినిమా విడుదల సందర్భంగా జరుగుతున్న ప్రమోషనల్ ఈవెంట్స్ లో సందడి చేసింది. ఛానల్స్ కి ఇంటర్వ్యూలతోపాటు 'రాజు గారి గది2' రిలీజ్ ప్రెస్ మీట్ లోను హుషారుగా పాల్గొంది.

ఇక ఆ ఈవెంట్ లో సమంత ముఖం 1000  క్యాండిల్ బల్బు మాదిరిగా వెలిగిపోతూ కనిపించింది. పెళ్లి తర్వాత సమంత ముఖంలో కొత్త కాంతి స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఇక మీడియా చూపు అంతా సమంత మీదే. అక్కినేని ఇంటికోడలిగా అడుగుపెట్టిన సమంత మొదటిసారి మీడియా ముందుకు రావడం... అది కూడా మామగారు నాగార్జునతో కలిసి ఎంతో పద్దతిగా దర్శనమివ్వడం మాత్రం చూపరులను ఆకర్షించింది. ఇక అక్కినేని కోడలిగా తన బాధ్యతలు మరింత పెరిగాయని... వాటిని తాను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పడమే కాదు రాజు గారి గది2 సినిమా గురించి కూడా గొప్పగా చెప్పేసింది.

అయితే సమంత మాత్రం ఉన్నట్టుండి తాను గతంలో చేసిన ఎన్నో సినిమాలు... అసలు ఎందుకు చేశానో కూడా అర్థం కాని పాత్రలు చేశానని... కాని 'రాజు గారి గది 2' లో చేసింది మాత్రం చాలా చాలా స్పెషల్ పాత్ర అంటూ ఆకాశానికి ఎత్తేసింది. మరి నిజంగా రాజుగారి గది2 లో సమంత పాత్ర ఎంత స్పెషల్ అయినా అవ్వొచ్చు కానీ, ఇలా ఆ సినిమాని ఆకాశానికెత్తేస్తూ ఆమె నటించిన ఓల్డ్ సినిమాలను చిన్న చూపు చూస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదనే కామెంట్స్ పడుతున్నాయి. అయినా మరికొందరు వదిలేయండిలే కొత్తపెళ్లి కూతురు.. తెలియక ఏదో అనేసింది లైట్ తీసుకోండి అంటున్నారు.

Samantha Sensational Comments on Her Old Movies:

Samantha Controversy Speech at Raju Gari Gadhi 2 Press Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ