ఈ మధ్యన టాలీవుడ్ లో కమెడియన్ వెన్నెల కిషోర్ డిమాండ్ బాగా పెరిగింది. అమీతుమీ, ఆనందో బ్రహ్మ వంటి సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న వెన్నెల కిషోర్ కి స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ రానప్పటికీ... ఇప్పుడొస్తున్న చిన్న సినిమాలన్నిటిలో వెన్నెల కామెడీ కనబడుతుంది. చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా వున్న వెన్నెల కిషోర్ వలన కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు వచ్చాయి అంటేనే వెన్నెల కిషోర్ డిమాండ్ ఏ రేంజ్ లో ఉందొ చెప్పొచ్చు. మొన్నామధ్యన వెన్నెల కిషోర్ డేట్స్ ఖాళీ లేవని నాగ చైతన్య - చందు మొండేటి కలయికలో సెట్స్ మీద కెళ్ళాల్సిన 'సవ్యసాచి' సినిమా ఇప్పటివరకు మొదలు కాలేదు.
అయితే ఇప్పుడు తాజాగా వెన్నెల కిషోర్ వలన ఒక సినిమా షూటింగ్ వాయిదా వేసుకుందనే న్యూస్ హైలెట్ అయ్యింది. ఆ సినిమా ఏదో కాదు నాగార్జున, సమంతలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రాజుగారి గది సినిమా ఎప్పుడో దసరా ముందే విడుదలవ్వాల్సి ఉంది. కానీ ఆ సినిమా షూటింగ్ చాలా రోజులు వాయిదా పడడంతో ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా షూటింగ్ డిలే అవడానికి సినిమా విడుదల వాయిదా పడడానికి కారణం వెన్నెల కిషోర్ అని చెబుతున్నాడు రాజుగారి గది దర్శకుడు ఓంకార్. అయితే సినిమా మొదలవ్వక ముందే వెన్నెల డేట్స్ లేకపోవడంతో సెట్స్ మీదకి సకాలంలో వెళ్లలేకపోయామని చెబుతున్న ఈ డైరెక్టర్ రాజుగారి గది సినిమాకి అన్ని సిద్దమనుకున్నాక.. ఆఖరికి నాగార్జున, సమంతలు కూడా డేట్స్ ఇచ్చేసాక... కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ సినిమాలో పాత్రకి ఒప్పుకున్నా... డేట్స్ కేటాయించలేకపోవడంతో షూటింగ్ అనుకున్న టైం కి మొదలెట్టలేకపోయామని చెప్పి వెన్నెల కిషోర్ క్రేజ్ ఎంతో చెప్పి షాకిచ్చాడు.
అలాగే నాగార్జున కూడా వెన్నెల డిమాండ్ మామూలుది కాదంటున్నారు. మరి రాజుగారి గది లో వెన్నెల కిషోర్ కామెడీని ప్రేక్షకులెలా ఎంజాయ్ చేస్తున్నారో ఇంకా రిపోర్ట్ అందలేదుగాని.. ప్రస్తుతానికి వెన్నెల కిషోర్ డిమాండ్ మాత్రం పీక్స్ లో వుంది. అసలు ప్రస్తుతానికి యాప్ కమెడియన్ అప్షన్ ఒక్క వెన్నెల కిషోర్ తప్ప మరెవరు కనబడం లేదు అనేది అతిశయోక్తి కాదంటున్నారు.