ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత మెయిన్ లీడ్ లో అశ్విన్, సీరత కపూర్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ తారాగణంతో తెరకెక్కిన రాజుగారి గది 2 ఈ శుక్రవారమే విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో మెంటలిస్ట్ నాగార్జున నటనకు, ఆత్మ అమృతగా ఇరగదీసిన సమంత పెరఫార్మెన్సు కి అందరూ ఫిదా అవుతున్నారు. హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీతో పాటు, హర్రర్ సన్నివేశాలకు కొదవ లేదు. ఇంటర్వెల్ కి ముందు వాటర్ లో నుండి అమృత ఆత్మ రుద్ర లోకి ప్రవేశించే సన్నివేశాలు అద్భుతం అంటున్నారు ప్రేక్షకులు.
అలాగే ఫస్ట్ హాఫ్ కాస్త డల్ అంటున్నప్పటికీ కుటుంబంతో కలిచొచ్చిన వారు మాత్రం మొత్తం కూర్చుని హాయిగా నవ్వుకునే కామెడీ ఉందని.... మరీ... పూర్ కామెడీ అయితే కాదంటున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున ఎంట్రీ దగ్గరనుండి ఒక్కసారిగా కిక్ రావడమే కాదు.. సెకండ్ హాఫ్ మొత్తం నాగార్జున, సమంతల మీదే నడిచింది. రాజుగారు గది 2 క్రెడిట్ మొత్తం నాగార్జునకి సమంతకు ఇచ్చెయ్యొచ్చు అన్నంతగా వారి పెరఫార్మెన్సు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు.
దసరా సినిమాల హడావిడి ముగియడం రాజు గారి గది 2 కి కలిసొచ్చిందని... రెండు తెలుగు రాష్ట్రలలోనే కాక ఓవర్సీస్ లోను ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్స్ సాధించిందంటున్నారు. అలాగే నాగార్జున, సమంతలు సినిమా విడుదలకు ఒక్క వారం ముందే మామ కోడళ్ళు కావడం కూడా ఈ సినిమా విజయానికి కలిసొచ్చిందనే టాక్ వుంది. మామ కోడళ్ల సెంటిమెంట్ కూడా సినిమా హిట్ అవడానికి ఒక కారణంగానే చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ సినిమా క్రెడిట్ మొత్తం నాగ్, సామ్ లు కొట్టేశారు.