ఇటీవల పవన్‌కళ్యాణ్‌కి మూడో భార్య మగబిడ్డను జన్మించిన సందర్భంగా పవన్ ఆ పిల్లాడిని ఒడిలోకి తీసుకుని ముచ్చటపడి పోతున్న ఫొటోని చూసి ఇందులో పవన్ ఎంతో క్యూట్‌గా ఉన్నారు... అని కామెంట్ చేశాడు. అది పొగుడుతున్నాడో... తిడుతున్నాడో అర్ధం కాక అందరూ తలలు పట్టుకున్నారు. దాని గురించి వర్మ తాజాగా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ, ఈమధ్య కాలంలో పవన్ మీద రెండే ట్వీట్స్ చేశాను. పవన్‌పై ప్రస్తుతం ట్వీట్స్ చేయడం మానేశాను. గతంలో పవనిజం పుస్తకంపై పవన్ గురించి, బుక్ గురించి పాజిటివ్‌గా స్పందించాను. రివ్యూ కూడా సానుకూలంగానే రాశాను. కో రైటర్ మీద మాత్రం విమర్శలు చేశాను.
మొన్న పవన్ కళ్యాణ్‌కి పిల్లాడు పుట్టినప్పుడు ట్వీట్ చేశాను. ఎందుకంటే నాకు నా పిల్లల కన్నా పవన్ అంటే ఎంతో ఇష్టం. ట్వీట్స్ చేసి నా చావు నేను చస్తాను. మీ చావు మీరు చావండని అభిమానులకు చెప్పను. అది వారిష్టం. 'కొడుకును ఒడిలో పెట్టుకున్న పవన్ ఎంతో క్యూట్‌గా ఉన్నారని' మరోసారి అన్నాడు. ఇక బ్రదర్ అనిల్‌తో సినిమా విషయం చర్చకు రాలేదని, క్రిస్టియానిటీ గురించి మాట్లాడుకున్నామని చెప్పాడు. ఆయన మిమ్మల్ని కూడా క్రైస్తవ మతంలోకి ఆహ్వానించారా అంటే.. అంతలేదు.. నన్ను మార్చాలనుకునేంత అమాయకుడెవ్వరూ ఉండరని సమాధానం ఇచ్చాడు. నిజమే.. వర్మకి సలహా ఇచ్చే ధైర్యం ఎవరికి ఉంటుంది మరి..! ఇక వర్మ పవన్ విషయంలోనే కాదు..... ఆయన తన సొంత కూతురి విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తాడని తాజాగా రుజువైంది. తన కూతురు డాక్టర్ అని, కానీ ఆమె ఏ బ్రాంచో తెలియదని చెప్పాడు.
ఇక తన కూతురు తాను ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఫొటోని తన తండ్రి వర్మకి పంపింది. దానిని ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టాడు.. ఎవరైనా తండ్రి కూతురి ప్రైవసీని కాపాడాలనుకుంటాడు. కానీ వర్మ ఆ ఫోటోని సోషల్‌మీడియాలో పెట్టేసరికి కూతురు నుంచి ఆయనకు ఓ మేసేజ్ వచ్చిందట. బి ఇన్‌యువర్ లిమిట్స్.. మైండ్ యువర్ బిజినెస్. నా ఫోటోని నీకోసం పంపితే దానిని మీడియాలో ఎందుకు పెట్టావు? అని ప్రశ్నిస్తే,.. నా మనస్తత్వం తెలిసి కూడా నువ్వు నాకు అలాంటి ఫోటో ఎందుకు పంపావు? అని వర్మ రిప్లై ఇచ్చాడట. ఇక తన కూతురి పెళ్లి సమయంలో కూడా తాను గుంపులో గోవిందయ్యలా ఉన్నానని చెప్పాడు. ఏమిటి అలా.. స్టేజీ మీద ఉండవచ్చు కదా..! అంటే నాకు పెళ్లిళ్లన్నా, చావులన్నా ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు. తన భార్యతో పెద్దగా మాట్లాడనని, హైదరాబాద్ వస్తే జస్ట్ కలుస్తా అంతేనని చెప్పాడు. ఇక దీనిని బట్టి చూస్తే పెళ్లీడు వచ్చిన ఆడపిల్ల ఉన్నవాడు పోర్న్ వీడియోలు చూస్తాను.. పోర్న్‌వీడియోలను కలెక్ట్ చేస్తానని చెప్పే వ్యక్తి గురించి మాటలు అనవసరమని నాడు పవన్ చేసిన వ్యాఖ్యలు సమంజసమేనని అర్ధమవుతోంది.