Advertisementt

'బృందావనం' లో చేసిన పాత్రపై కాజల్ ఇలా!

Wed 18th Oct 2017 01:20 AM
kajal agarwal,brindavanam,kalyan ram,mla movie   'బృందావనం' లో చేసిన పాత్రపై కాజల్ ఇలా!
Kajal about Brindavanam Role 'బృందావనం' లో చేసిన పాత్రపై కాజల్ ఇలా!
Advertisement
Ads by CJ

కాజల్‌ అగర్వాల్‌.. నేటి హీరోయిన్లలో ఈమెది ప్రత్యేక స్థానం. చిరంజీవి నుంచి రామ్‌చరణ్‌ వరకు, జూనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి కళ్యాణ్‌రామ్‌ వరకు అందరినీ చుట్టేస్తోంది. ఇక తేజ-కళ్యాణ్‌రామ్‌ల 'లక్ష్మీకళ్యాణం' ద్వారా దశాబ్దం ముందు పరిచయమై 'చందమామ, మగధీర' లలో స్టార్‌హీరోయిన్‌గా మారింది. ఇక తన కెరీర్‌లో 50కి పైగా చిత్రాలలో నటించి నేటితరం హీరోయిన్స్‌లో రేర్‌ఫీట్‌ సాధించింది. ఇక ఆమె తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఓ వెలుగు వెలిగిన వారు కూడా కనుమరుగైనా తాను మాత్రం సందడి చేస్తోంది. 

ఇక ఆమె విజయ్‌ సరసన నటిస్తున్న 'మెర్శల్‌' 18వ తేదీన విడుదల కానుంది. విజయ్‌తో తాను మూడో చిత్రంలో చేయడం ఆనందంగా ఉందని, ఇక సమంతతో నటించడం హ్యాపీగా ఉందని చెప్పి, పనిలో పనిగా ఆమెకు వివాహ శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇక తాను జూనియర్‌ ఎన్టీఆర్‌తో చేసిన 'భూమి' పాత్ర అందరికీ నచ్చిఉండవచ్చు. రీల్‌లైఫ్‌లో అయితే ఓకే గానీ రియల్‌ లైఫ్‌లో అలాంటి క్యారెక్టర్‌ అంటే మహా బోరింగ్‌ అంటోంది. తమిళంలో కూడా తన కెరీర్‌ బాగుందని, నాకు ఇష్టమైన సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్న చిత్రంలో నటిస్తుండటం ఎంతో సంతోషంగా ఉన్నానని, ఈ ఏడాది విడుదలైన 'ఖైదీనెంబర్‌ 150, నేనే రాజు నేనే మంత్రి, వివేగం' లోని పాత్రలు తనకు నచ్చాయని తెలివిగా తప్పించుకుంది. 

కళ్యాణ్‌రామ్‌తో ఇంతకాలం తర్వాత 'ఎమ్మెల్యే' చిత్రంలో నటిస్తున్నాను. నాటికి నేటికి మా ఇద్దరిలో ఏం తేడా లేదు. కాకపోతే పరిస్థితులను ఎదుర్కోవడం నేర్చుకున్నామని, నేనెప్పుడు నా పనిపైనే దృష్టి పెడతాను గానీ సినిమాపై అంచనాలను దృష్టిలో పెట్టుకోనని చెబుతూ, తాను 'ఎమ్మెల్యే' చిత్రం తర్వాత 'క్వీన్‌' రీమేక్‌ 'ప్యారిస్‌..ప్యారిస్‌' లో నటిస్తానని, మరో సీక్రెట్‌ ప్రాజెక్ట్‌ ఉంది... అంటూ సస్పెన్స్‌లో పెట్టింది. ఇక అందానికి యోగా , సన్‌స్క్రీన్‌ వాడటం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, సరిగా నిద్రపోవడం ముఖ్యమని అందరికీ తన బ్యూటీ రహస్యాలను చెప్పేసింది. అంతా బాగానే ఉంది కానీ ఆమె 'బృందావనం' చిత్రంలోని ప్రేక్షకులు మెచ్చిన క్యారెక్టర్‌ గురించి అలా నోరు జారకుండా ఉంటే బాగుండేదని ఎన్టీఆర్‌ అభిమానులు అంటున్నారు. 

Kajal about Brindavanam Role:

Kajal Agarwal Pramotes Mersal Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ