ఒకప్పుడు తెలుగులో సన్నగా పొట్టిగా వుంది తనదైన హాస్యాన్ని పండించిన కమెడియన్ వేణుమాధవ్. ముఖ్యంగా ఆయనకు 'సింహాద్రి, తొలిప్రేమ, దిల్' వంటి అనేక చిత్రాలు కమెడియన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చాయి. నాడు బిజీ బిజీగా ఉండే ఆయన బాగానే సంపాదించారు. ఎస్వీకృష్ణారెడ్డి 'హంగామా' చిత్రంతో పాటు తానే నిర్మాతగా 'భూకైలాస్, ప్రేమాభిషేకం' చిత్రాలలో హీరోగా నటించి నిర్మాతగా కూడా వ్యవహరించి బాగా నష్టపోయాడు.
ఇక ఆయన గత కొంతకాలంగా సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపికి సపోర్ట్‌గా ప్రచారం చేసి జగన్‌ని 'బట్టే బాజ్' అని, సినిమా ఇండస్ట్రీలో 'రోజా' ఎవరో తెలియదని నానా సంచలన వార్తలతో మరలా వెలుగులోకి వచ్చాడు. ఆ మద్య ఆయన చనిపోయాడని మీడియాలో వార్తలు వస్తే మీడియా ముందుకు వచ్చి బోరుమన్నాడు. ఇక ఆయనకు బయటకి చెప్పుకోలేని రోగం ఉందని, చివరకు ఎయిడ్స్‌అని కూడా ప్రచారం జరిగింది. ఇటీవల ఆయనకు ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటాడని, అందుకే సినిమాలలో అవకాశాలు రావడం లేదనే పుకారు వచ్చింది.
తాను తన బ్లడ్‌ని ఇస్తానని, ఎవరైనా ఏ రోగం ఉందో పరీక్షించుకోవచ్చని సవాల్ విసిరాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, నాకు ఫిట్స్ లేవు. 'రచ్చ' షూటింగ్ టైంలో మరో రెండు మూడు చిత్రాల షూటింగ్స్‌లో బిజీగా ఉండేవాడిని, ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్, రాత్రి డిన్నర్‌లు చేయడానికి కూడా టైం ఉండేది కాదు. దాంతో 'రచ్చ' షూటింగ్‌లో ఆకలి వల్ల కళ్లుతిరిగిపడిపోయాను. ఇక 'బృందావనం' ప్రమోషన్స్ సందర్భంగా సుమ 'జీన్స్'షోలో పడిపోయాననేది నిజం కాదు. నాకు ఫిట్స్‌లేవని క్లారిటీ ఇచ్చాడు వేణుమాధవ్.