ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా నాజూగ్గా కనబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, సమంత లాంటి హీరోయిన్స్ అయితే తమ ఫిజిక్ ని కాపాడుకోవడానికి ఎక్కువ టైం జిమ్ లలో గడిపేస్తూ తమ ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్నారు. అంతలా కష్టపడుతూ నాజూకైన స్పైసి లుక్స్ తో వారు టాలీవుడ్ ని దున్నేస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న రాశి ఖన్నా కూడా తన బరువుని తగ్గించుకుని స్లిమ్ అయ్యింది. ఇక తాజాగా బొద్దు గుమ్ముగా నాని 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్ మొదటి రెండు సినిమాల్లోనూ ముద్దుగా బొద్దుగా ఉన్నా... క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.
'కృష్ణగాడి వీర ప్రేమ గాధ', శర్వానంద్ తో 'మహానుభావుడు' చిత్రాలలో క్యూట్ లుక్స్ తో, ట్రెడిషనల్ గా అదరగొట్టిన ఈ భామ తాజాగా విడుదలైన 'రాజా ది గ్రేట్' సినిమాలో మాత్రం బాగా బొద్దుగా కనిపించేసింది. అందంతోను, నటనతోను అద్భుతమైన లుక్స్ తోనూ ఆకట్టుకుంటూ హిట్స్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం 'రాజా ది గ్రేట్' లో తేలిపోయింది. రవి తేజకి జోడిగా నటించిన మెహ్రీన్ చుట్టూనే 'రాజా ది గ్రేట్' కథ అల్లుకుని ఉంటుంది. కథ మొత్తం మెహ్రీన్ పాత్ర చుట్టూ ఉన్నా.. అందులో మెహ్రీన్ నటనతో ఆకట్టుకోలేకపోయింది. అందులో కొద్దిగా గ్లామర్ గా ట్రై చేసే సరికి మరీ బొద్దుగా కనిపించేసింది.
ఓ అన్నంత గ్లామర్ షో చెయ్యకపోయినా.. ఉన్నంతలో బాగానే చూపించిన మెహ్రీన్ ఆ గ్లామర్ లుక్ లో లావుగా కాస్త వికారంగానే కనబడింది. మరి రెండు సినిమాల్లో ఆమె బొద్దె ముద్దుగా కనిపించినా ఈ సినిమాలో మాత్రం ఆ బొద్దు వికారంగా కనబడింది. మరి చేతిలో నాలుగు సినిమాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పాలి అంటే కాస్త కొవ్వు కరిగించక తప్పేలా లేదు అంటున్నారు. మరి బరువుని కంట్రోల్ లో ఉంచుకుంటేనే.. కదా పది కాలాల పాటు హీరోయిన్ గా కనబడేది. లేదంటే కొంతమంది హీరోయిన్స్ లాగా నాలుగు సినిమాలకే ఇండస్ట్రీ నుండి తప్పుకునే పరిస్థితి వచ్చేస్తుంది. మరి మెహ్రీన్ ఈ విషయాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.