Advertisementt

సమంత మనసులో ఉన్నది ఇదే..!

Sat 21st Oct 2017 10:57 AM
samantha,lady oriented movies,savitri  సమంత మనసులో ఉన్నది ఇదే..!
Samantha Full Stop to Glamour roles సమంత మనసులో ఉన్నది ఇదే..!
Advertisement
Ads by CJ

సమంత కెరీర్‌ని మొదలుపెట్టి వరుసగా గ్లామర్‌ పాత్రలు చేస్తున్నప్పుడు ఓ విలేకరి అన్ని గ్లామర్‌ పాత్రలేనా. మంచి ప్రాధాన్యం ఉన్న, నటనా ప్రతిభ చూపించే పాత్రలు కూడా చేయాలి కదా...! అని అడిగితే ఈ అమ్మడు ఇంత ఎత్తున ఎగిరిపడింది. ఆ విలేకరి.. జీవితం కొంతకాలం సాగిన తర్వాత మనకంటూ గొప్పగా చెప్పుకోవడానికి నాలుగు చిత్రాలు ఉండాలి కదా అంటే దానిపై కూడా అసహనం వ్యక్తం చేసింది. కానీ కెరీర్‌పీక్‌లో ఉన్నప్పుడే ఆమె పెళ్లి అయి అక్కినేని ఫ్యామిలీ వంటి పెద్ద ఇంటికి కోడలు కావడంతో ఇప్పుడు తాను అన్ని కేవలం నటనాప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేస్తానని, కొన్ని తాను చేసిన చిత్రాలను నేడు చూసుకుంటే ఇవి ఎందుకు చేశానా? అనిపిస్తోందని చెప్పింది. నాడు విలేకరి అడిగిన ప్రశ్నకు కోప్పడిన ఆమె నేడు వాస్తవాన్ని తెలుసుకుంది. ఇక ఈమె తాను ఇంతకాలం ఒకే తరహా పాత్రలు చేశానని పలువురు విమర్శిస్తున్నారు. 

కానీ ఈ ఎనిమిదేళ్ల కెరీర్‌లో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. కేవలం విజయవంతమైన చిత్రాలలో నటిస్తే సరిపోదు. మనకు నచ్చింది చేయడం.. వాటి నుంచి నేర్చుకోవడం కూడా ముఖ్యం. ఇక నన్ను పెళ్లయిన తర్వాత అందరూ సినిమాలు చేస్తారా? మానేస్తారా? అనే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో నాకు అర్దం కావడం లేదు. నాకు నటన, కుటుంబం రెండు ముఖ్యమే. ఒక దాని కోసం మరోటి వదులుకోను. ఇక నుంచి నేను ఎంజాయ్‌ చేయగలిగిన పాత్రలనే ఎంచుకుంటాను. నాకెవ్వరూ పోటీ కాదు. మహానటి సావిత్రి గారు నటించిన చిత్రాలు చూశాను. 

ఆమె ఎంతో అందమైనదే కాదు ఎంతో నటనా ప్రతిభ ఉన్న నటి. ఈ చిత్రంలో మంచి పాత్రను చేస్తున్నాను. ఇప్పుడు రచయితలు కూడా మహిళా ప్రాధాన్యం ఉన్న కథలు రాస్తున్నారు. ఏదైనా లేడీ ఓరియంటెడ్‌ చిత్రం రూపొందుతోంది అంటే వెంటనే ఆ చిత్రం గురించి ట్వీట్‌ చేస్తాను. అవి చూసైనా అలాంటి పాత్రలు నాకొస్తాయనే ఆశ అని చెప్పుకొచ్చింది. సో.. ఇక ఈమె గ్లామర్‌పాత్రల్లో నటించడం మానేసినట్లే...కేరాఫ్‌ లేడీ ఓరియంటెడ్‌ పాత్రలకు ఈమె పరిమితం కానుంది. ఈమె ద్వారా మంచి చిత్రాలు వస్తే అది కూడా మంచిదే కదా....!

Samantha Full Stop to Glamour roles:

Samantha Wants to Lady Oriented Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ