Advertisementt

ఉన్నది ఒకటి... హిట్‌ కొడితే రెండు రెడీ!

Sun 22nd Oct 2017 12:40 PM
vunnadi okate zindagi movie,kishore tirumala,ram,venkatesh,nani  ఉన్నది ఒకటి... హిట్‌ కొడితే రెండు రెడీ!
Two Big Movies in Kishore Tirumala Hands ఉన్నది ఒకటి... హిట్‌ కొడితే రెండు రెడీ!
Advertisement
Ads by CJ

వరస ఫ్లాప్‌లలో ఉన్న రామ్‌కి 'నేను శైలజ' తో పెద్ద హిట్‌ ఇచ్చి మరలా ట్రాక్‌ ఎక్కించిన ఘనత కొత్త దర్శకుడైన కిషోర్‌ తిరుమలకి దక్కుతుంది. కానీ ఆ తర్వాత మరలా తన రొటీన్‌ బాటలో 'హైపర్‌' చేసి పరిస్థితి మరలా మొదటికి తెచ్చుకున్నాడు రామ్‌. దాంతో మరలా కిషోర్‌ తిరుమలనే నమ్ముకుని తన పెదనాన్న స్రవంతి రవికిషోర్‌ నిర్మాణంలో 'ఉన్నది ఒకటే జిందగీ' చేస్తున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ అందించిన పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ను రాబడుతున్నాయి. 

ఇక 'నేను..శైలజ'లో హీరోయిన్‌ కీర్తిసురేష్‌ పాత్రను ఎంత బాగా మలిచాడో ఈ 'ఉన్నది ఒక్కటే జిందగీ'లో కూడా ఆయన మరో మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ని కూడా అంతే గొప్పగా చూపించాడట. తాననుకున్న స్నేహం, ప్రేమల మీద రాసుకున్న ఈ స్క్రిప్ట్‌ ఎంతో బాగా వచ్చిందని.. ముఖ్యంగా రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌లు ఎంతో బాగా నటించారని కిషోర్‌ తిరుమల చెప్పుకొచ్చాడు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌, సున్నితమైన భావోద్వేగాలు, రామ్‌, అనుపమ మధ్య వచ్చే సంభాషణలు, సీన్స్‌ ఎంతో ఫ్రెష్‌గా ఉంటాయని, ఈచిత్రం యూత్‌నే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని చెబుతూ, రామ్‌ పాత్ర రెండు విభిన్న షేడ్స్‌లో సాగుతుందని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ చిత్రం తర్వాత వెంకటేష్‌, నానిల కోసం కథలు రాస్తున్నానని చెప్పాడు. నాని చిత్రానికి 'చిత్రలహరి'అనే టైటిల్‌ని కూడా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 'ఉన్నది ఒకటే జిందగీ' రిజల్ట్  మీద ఆయనకు రెండు సినిమాలు ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. 

Two Big Movies in Kishore Tirumala Hands :

Director Kishore Tirumala Movies after Vunnadi Okate Zindagi Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ