ఎప్పటినుండో నాగార్జున తన కొడుకు లాంచింగ్ సినిమా ఒక్క రేంజ్ లో ఉండాలని ఊహించి డైరెక్టర్ వీవీ వినాయక్ చేతిలో పెట్టాడు. ఆ సినిమా రిజల్ట్ ఏంటో మాట్లాడుకోవలసిన అవసరం లేదు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నాగార్జున 'మనం' సినిమా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ చేతిలో పెట్టాడు అఖిల్ ని. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో..అఖిల్ 'హలో' సినిమాలో యక్ట్ చేస్తున్నాడు.
నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మొదటి నుండి డిసెంబర్ 22 న విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు అని.. షూటింగ్ ఇంకా బాలన్స్ ఉందని అని అంటున్నారు. అయితే ఆ పుకారులకు చెక్ పెడుతూ.. 'హలో' సినిమా హీరో అఖిల్ అక్కినేని స్వయంగా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. 'హలో' సినిమా చివరి షెడ్యూల్ మొదలు కాబోతుందని చెప్పటమే కాకూండా.. 'హలో' నిర్మాత నాగ్ చెప్పినట్టే ఈ సినిమా డిసెంబర్ 22 కె విడుదల అవుతుందని అఖిల్ తన ట్విట్టర్ లో స్పష్టం చేశాడు.
అక్టోబర్ చివరి వారానికల్లా షూటింగ్ పూర్తి చేసుకుని.. నవంబర్ మొదటి వారం నుండి 'హలో' సినిమా ప్రచారానికి శ్రీకారం చుట్టాలని చిత్ర బృందం భావిస్తుంది. ఇక అక్కినేని ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో.. అఖిల్ సరసన కొత్త అమ్మాయి కళ్యాణి నటిస్తుంది.