Advertisementt

అఖిల్ కి స్వీటీ పోటీ తప్పదా..!

Mon 23rd Oct 2017 01:03 PM
akhil,hello,anushka,bhagmathi,christmas  అఖిల్ కి స్వీటీ పోటీ తప్పదా..!
Anushka Bhagmati vs Akhil Hello అఖిల్ కి స్వీటీ పోటీ తప్పదా..!
Advertisement
Ads by CJ

యువి క్రియేషన్స్ వారు పెద్ద హీరోలను లెక్క చెయ్యడం లేదు. చిన్న సినిమాలను నిర్మిస్తూ బిగ్గెస్ట్ హిట్స్ అందుకోవడం వారికి ఈ మధ్యన పరిపాటి అయ్యింది. పెద్ద సినిమాలు బరిలో ఉన్నా ఏ మాత్రం లెక్కచెయ్యకుండా ఎంతో ధైర్యంతో  తమ సినిమాలను రిలీజ్ చేసి హిట్స్ పట్టుకుపోతున్నారు. ఈ మధ్యన ఈ విషయం పరిపాటిగా మారిపోయింది. దాదాపు మూడు సార్లు ఇలానే పెద్ద సినిమాల్తో కయ్యానికి కాలుదువ్వి గెలిచిన ఈ నిర్మాణ సంస్థ నాలుగో సారి కూడా పెద్ద సినిమాకి పోటీ పెట్టాలనుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం యువి క్రియేషన్స్ వారు అనుష్క మెయిన్ లీడ్ లో... 'పిల్ల జమిందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో 'భాగమతి' సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టుకుని ఏళ్ళు గడుస్తున్నా సినిమా విడుదలకు మాత్రం కష్టాలు పడుతుంది. షూటింగ్ పూర్తయినా... గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కానీ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తుంది. అయితే మొన్నామధ్యన 'భాగమతి' సినిమాని సంక్రాంతి బరిలో దింపుతారనే ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా యువి క్రియేషన్స్ వారు 'భాగమతి' డిసెంబర్ మూడవ వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట.

మరి డిసెంబర్ లో నాగ్ నిర్మాణంలో విక్రమ్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'హలో' సినిమాని విడుదల చేస్తున్నట్లుగా నాగార్జున ఎప్పుడో అధికారిక ప్రకటన చేసాడు. మరి నాగ్ ఎంతో పక్కాగా అఖిల్ సినిమాని డిసెంబర్ 22  న విడుదల చేస్తున్నట్లుగా చెప్పగా కూడా.... యువి క్రియేషన్స్ వారు అనుష్క క్రేజ్ ని వాడుకకి 'భాగమతి' డిసెంబర్ 22 నే విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. 'బాహుబలి' తర్వాత అనుష్క నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే పెట్టుకున్నారు యువి వారు. మరి నాగార్జున కూడా అఖిల్ రెండో సినిమా 'హలో' ని ఎంతో పకడ్బందీగా తెరకెక్కించి మంచి టైం లో విడుదల చేసి అఖిల్ కి హిట్ అందించాలని అనుకుంటున్నాడు. మరి ఇప్పుడు అనుష్క 'భాగమతి' తో 'హలో' కి దెబ్బ పడుతుందనే అనుమానం తో 'భాగమతి' ని వాయిదా వేసుకోమని నాగ్ వారిని కోరినట్లుగా కూడా ఫిలింనగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో..?

Anushka Bhagmati vs Akhil Hello:

Anushka Bhagmati and Akhil Hello will Release on Christmas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ