సమంత - నాగ చైతన్య పెళ్లి ఎంతో ఘనంగా నిర్వహించింది అక్కినేని ఫ్యామిలీ. ఒక రోజు హిందూ సంప్రదాయంగా, ఇంకో రోజు క్రిస్టియన్ సంప్రదాయంగా చై - సామ్ ల పెళ్లి గోవాలో జరిగింది. అయితే నాగార్జున రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో పెడతాం అని ముందే చెప్పారు. కానీ నాగ చైతన్య వాళ్ల అమ్మ లక్ష్మి చెన్నై లో తన ఇంట్లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ ఏర్పాట్లు మొత్తం దగ్గుబాటి ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ రిసెప్షన్లో అత్తాకోడళ్లు అయినా లక్ష్మి, సమంతలు ఇద్దరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకోవడం అందరిని ఆకర్షించింది.
ఇక రిసెప్షన్ కి దగ్గుబాటి ఫ్యామిలీ తో పాటు దగ్గర బంధువులు కూడా హాజరైయ్యారు అని తెలుస్తుంది. ఇక ఈ రిసెప్షన్ లో చైతు - సామ్ లతో పాటు రానా హైలెట్ అయ్యాడు. అయితే సమంత చెన్నైలోని అత్తగారైన లక్ష్మి వాళ్ల ఇంట్లో చెట్ల కొమ్మలు, బొమ్మలు, గార్డెన్ ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నా అత్తగారిల్లు చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేసింది. అంతేకాకుండా సమంతకి తన అత్తగారి ఇల్లు చాలా బాగా నచ్చిందంట. మరి లక్ష్మి తన కొడుకు కోడలు రిసెప్షన్ ని సింపుల్ గానే అని చెప్పినా.. గ్రాండ్ గానే నిర్వహించింది. ఇక నాగార్జున చెప్పినట్లుగా హైదరాబాద్ లో సమంత - నాగ చైతన్య ల రిసెప్షన్ వచ్చే నెలలో వుండొచ్చని సమాచారం.
Click Here To see The More Photos