Advertisementt

యంగ్ హీరోయిన్ దెబ్బకి త్రిష పరార్!

Wed 25th Oct 2017 03:44 PM
trisha,vikram,saamy 2,keerthi suresh  యంగ్ హీరోయిన్ దెబ్బకి త్రిష పరార్!
Trisha Out From Vikram and Hari Saami 2 యంగ్ హీరోయిన్ దెబ్బకి త్రిష పరార్!
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో గతంలో హరి - విక్రమ్ - త్రిష కలయికలో వచ్చిన 'సామి' సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'సామి' కి సీక్వెల్ గా మళ్ళీ విక్రమ్ - హరి కలయికలోనే 'సామి 2' సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా అధికారికంగా కూడా సెట్స్  మీదకెళ్ళిపోయింది. అయితే 'సామి' సినిమాలోని హీరోయిన్ త్రిషనే మళ్ళీ 'సామి 2' కి కూడా తీసుకున్నారు హీరో, దర్శకులు. అలాగే సెట్స్ మీదనున్నఈ సినిమా మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేసేసారు. అయితే మొదటి షెడ్యూల్ అలా మొదలైందో లేదో.. ఇలా త్రిష ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు చెప్పి చిత్ర బృందానికి షాకిచ్చింది. 

స్క్రిప్ట్ విషయంలో ఏవో తేడాలున్నాయనే సాకుతో 'సామి 2' ప్రాజెక్ట్ నుండి త్రిష తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి చెప్పాపెట్టకుండా ఇలా ట్విట్టర్ కెక్కి సినిమా నుండి తప్పుకున్నట్లు త్రిష చేసిన పోస్ట్ చూసి చిత్ర బృందం ఖంగు తింది. అయితే స్క్రిప్ట్ లో తేడా ఉందని సినిమా నుండి త్రిష తప్పుకుంది. కానీ స్క్రిప్ట్ లో తేడా లేదు ఏమిలేదు... త్రిష ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి అసలు విషయం వేరే ఉందంటున్నారు. అదేమిటంటే 'సామి 2' లో కీర్తి  సురేష్ కారణంగానే త్రిష ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని కోలీవుడ్ మీడియా  కోడై కూస్తుంది. 'సామి 2'లో విక్రమ్ కి జోడిగా త్రిషతో పాటు కీర్తిసురేష్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే 'సామి 2' లో త్రిష కంటే కీర్తిసురేష్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. 

అంతేకాకుండా  రీసెంట్ గా బయటికి వచ్చిన వర్కింగ్ స్టిల్స్ లో కూడా త్రిషను సైడ్ కి పెట్టి కీర్తి సురేష్  ఉన్న ఫొటోల్ని మాత్రమే విడుదల చేయడంతో త్రిషకు కోపమొచ్చినట్టుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి కీర్తి క్రేజ్ ని చూసి త్రిష తట్టుకోలేక ఇలా చేసిందంటున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ హవా తెలుగు తమిళంలో మంచి జోరుమీదుంటే... త్రిషకి మాత్రం స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు లేక చిన్న చితక సినిమాల్లో నటిస్తుంది.

Trisha Out From Vikram and Hari Saami 2:

Keerthi Suresh Bagged Trisha Role in Saami 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ