Advertisementt

ఈ ఫేమస్‌ జంట పెళ్లి డిసెంబర్‌లోనేనట!

Sat 28th Oct 2017 12:37 AM
virat kohli,anushka,marriage updates,december  ఈ ఫేమస్‌ జంట పెళ్లి డిసెంబర్‌లోనేనట!
Anushka and Virat Kohli Marriage Updates ఈ ఫేమస్‌ జంట పెళ్లి డిసెంబర్‌లోనేనట!
Advertisement
Ads by CJ

పలువురు క్రికెటర్లు సినీ తారలను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అదే దారిలో ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్కశర్మలు నడుస్తున్నారు. కోహ్లి కెప్టెన్‌ కాకముందు నుంచే వీరి ప్రేమాయణం సాగుతోంది. వీరు ఆ విషయాన్ని ఏమీ దాచడానికి ప్రయత్నాలు చేయలేదు. ఏమి చేసినా, ఎక్కడ చక్కర్లు కొట్టినా బహిరంగంగానే తిరిగి ఎంజాయ్‌ చేస్తూ వచ్చారు. ఇక విరాట్‌ కోహ్లిని మీకు అనుష్కశర్మలో ఏమి నచ్చింది? అని ప్రశ్నిస్తే ఆమెలోని నిజాయితీ, ఏ విషయాన్నైనా దాచుకోకుండా ఉండే తత్వం నచ్చాయని చెప్పుకొచ్చాడు. 

ఇక అనుష్కశర్మని విరాట్‌లో మీకేమి నచ్చింది? అని ప్రశ్నిస్తే ఆయన ఎంతో హాట్‌గా ఉంటాడు. ప్రతి విషయంలోనూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ, పెళ్లికి ముందే.. ఇంకా చెప్పాలంటే మా పరిచయం జరిగిన నాటి నుంచే నా మాటకు ఎదురు చెప్పడు. నాకేది నచ్చితే తాను అదే చేస్తాడు. నా అభిరుచులను గౌరవిస్తాడు.. అని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా టీం ఇండియా క్రికెట్‌లో ప్రస్తుతం పలు యువ ఆటగాళ్లు కూడా బెర్త్‌ల కోసం ఆశపడుతున్నారు. దాంతో వరుసగా ఆట ఆడుతూ అలిసి పోయిన వారి స్థానంలో రొటేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. కానీ కెప్టెన్‌గా కోహ్లికి మాత్రం మూడు ఫార్మట్లలో ఆడుతూ ఉండటంతో విశ్రాంతి లేకుండా పోయింది. ఇక త్వరలో ఇండియాలో శ్రీలంక పర్యటన జరగనుంది. ఇందులో మొదటి రెండు టెస్ట్‌ మ్యాచ్‌లకు విరాట్‌ని ఎంపిక చేసిన సెలక్షన్‌ కమిటీ కెప్టెన్‌ కోహ్లికి కూడా మూడో టెస్ట్‌, వన్డేలు, టి20లలో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీనిపై విరాట్‌ని మీడియా ప్రశ్నిస్తే సమాధానం దాటవేశాడు. 

కానీ కోహ్లికి మాత్రం డిసెంబర్‌ నెలలో కాస్త విశ్రాంతి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. విరాట్‌ కూడా డిసెంబర్‌లో తనకు కాస్త విరామం కావాలని సెలక్టర్లను కోరాడని తెలుస్తోంది. మరోవైపు అనుష్కశర్మ కూడా తన షూటింగ్‌లకు డిసెంబర్‌లో గ్యాప్‌ ఇచ్చి, ఇది కూడా కేవలం రిలాక్స్‌ కావడానికే అని తెలిపింది. దీంతో బీటౌన్‌ వర్గాలలోని వారి సన్నిహితులు మాత్రం డిసెంబర్‌లో విరాట్‌కోహ్లి, అనుష్కశర్మలు పెళ్లి చేసుకోనున్నారని అది కూడా ఇండియాలో కాకుండా ఇటలీలోని మిలాన్‌ సిటీలో ఒకటవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏ విషయం దాచని ఈ జంట తమ పెళ్లే నిజమైతే ఇంత గుట్టుగా ఎందుకుంటారని మరికొందరు వాదిస్తున్నారు. 

Anushka and Virat Kohli Marriage Updates :

Anushka and Virat Kohli Marriage in december

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ