Advertisementt

మహేష్ టైటిల్స్ అవికావని క్లారిటీ ఇచ్చాడు!

Sat 28th Oct 2017 06:00 PM
mahesh babu,krishna mukundaa muraari,hare rama hare krishna,vamsi paidipalli,dsp  మహేష్ టైటిల్స్ అవికావని క్లారిటీ ఇచ్చాడు!
Vamsi Paidipalli Clarity on Mahesh movie titles మహేష్ టైటిల్స్ అవికావని క్లారిటీ ఇచ్చాడు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మహేష్‌బాబు కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్‌ అనే నేను' చిత్రం చేస్తున్నాడు. '1' (నేనొక్కడినే), 'శ్రీమంతుడు' తర్వాత 'భరత్‌ అనే నేను' కు కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తున్నాడు. ఆల్‌రెడీ 'భరత్‌ అనే నేను' కి ట్యూన్స్‌ అందించేసిన దేవిశ్రీ ఇప్పుడు ఇంకా మొదలేకానీ చిత్రం కోసం ట్యూన్స్‌ రెడీ చేస్తుండటం విశేషం. ఇటీవలే దర్శకుడు వంశీపైడిపల్లి అమెరికాలో లోకేషన్స్‌ కోసం వెళ్లి ఆ ఫోటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ లోకేషన్ల వేట పూర్తి కావడంతో ఆయన దేవిశ్రీనే అమెరికాకి రప్పించుకుని అక్కడ న్యూయార్క్‌ వీధుల్లో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఓపెన్‌ ప్లేస్‌లో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ పెట్టించేశాడు. 

న్యూయార్క్‌ వీధుల్లో ట్యూన్స్‌ కోసం సిట్టింగ్‌లో ఉన్న దర్శకుడు వంశీపైడిపల్లి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ల ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రం కధ అద్బుతంగా, ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉందంటూ దేవిశ్రీ తెలిపాడు. సరే సినిమా విడుదలయ్యే దాకా ఎవరైనా అదే చెప్తారు. ఇక ఈ చిత్రం టైటిల్స్‌గా 'కృష్ణ ముకుందా మురారి, హరే రామ హరేకృష్ణ' లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రం టైటిల్స్‌ ఆ రెండు కావని, టైటిల్‌ని ఫిక్స్‌ చేసిన తర్వాత తామే చెబుతామని వంశీపైడిపల్లి పోస్ట్‌ చేశాడు. 

ఇక ఈచిత్రాన్ని దిల్‌రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు మహేష్‌, బన్నీ అభిమానుల మధ్య ప్రస్తుతం వాగ్వివాదం నడుస్తోంది. బన్నీచేస్తున్న 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' ని ప్రారంభం రోజే ఏప్రిల్‌ 27న రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. తాజాగా మహేష్‌ 'భరత్‌ అనే నేను'ని కూడా అదే తేదీని కన్‌ఫర్మ్‌ చేశారు. తగ్గితే దానయ్య, మహేష్‌లు తగ్గాలే గానీ ముందుగా డేట్‌ లాక్‌ చేసుకున్న తమ చిత్రం విడుదల రోజే మహేష్‌ చిత్రం ఏమిటి? వీరిలో ఎవరు తగ్గుతారు? అనే చర్చ నడుస్తోంది.

Vamsi Paidipalli Clarity on Mahesh movie titles :

Krishna Mukundaa Muraari, Hare Rama Hare Krishna are not Mahesh Babu movie titles, says Vamsi Paidipalli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ